విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమికుల రోజులు కేవలం ఒక్కరోజు ముందే ప్రేమ జంట ఆత్మహత్య జిల్లాలో విషాదాన్ని నింపింది.
విశాఖపట్నం: విశాఖలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. చిన్న విషయంపై ఇద్దరి మధ్య కొనసాగిన వాగ్వాదం ప్రేమ జంట ప్రాణాలను బలితీసుకుంది. ప్రేమికుల రోజుకు ముందే జరిగిన ఈ ఘటన విశాఖలో విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే...గోపాలపట్నంలో బ్యూటీ పార్లర్ నడిపే మక్కా శిరీష, కంచరపాలెంకు చెందిన వెంకట్ లు ప్రేమికులు. గతకొంత కాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగిపోయారు. అయితే రోజూ మాదిరిగానే ఫోన్ లో సంభాషిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ ప్రారంభమయ్యింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఫోన్ లోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన శిరీష సొంతింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
read more పదమూడేళ్లుగా అదేపని, మహిళలే టార్గెట్: 150 మందికి పోర్న్ వీడియోలు
ప్రియురాలి ఆత్మహత్య గురించి తెలుసుకున్న వెంకట్ కూడా దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలు లేని జీవితం వ్యర్థమని భావించి ఊరి శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇలా ప్రేమికుల రోజుకు కేవలం ఒక్కరోజు ముందుగా ప్రేమజంట ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోవడం జిల్లాలో సంచలనంగా మారింది. వీరి ప్రేమ ప్రాణాలను బలితీసుకోవడమే కాదు ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
read more విషాదం... సపోటా పండు తిని చిన్నారి మృతి
ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్ధలాలకు చేరుకున్నారు. మృతదేహాలకుకేజీహెచ్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు విశాఖ పోలీసులు తెలిపారు.