విశాఖలో విషాదం...సముద్రంలో దూకి తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Jun 29, 2020, 10:45 AM ISTUpdated : Jun 29, 2020, 10:50 AM IST
విశాఖలో విషాదం...సముద్రంలో దూకి తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం

సారాంశం

భర్త వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన  విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నం: భర్త వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన  విశాఖపట్నంలో చోటుచేసుకుంది. బీచ్ లో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖలోని కంచరపాలెంకు చెందిన తోటకూర శిరీష(26) తన ఇద్దరు పిల్లలతో (బాబు 8, పాప 6 సంవత్సరాల)   బీచ్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా బస్టాపు వెనక సముద్రంలోకి దిగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇద్దరు పిల్లలకి చున్నీతో కట్టి సముద్రంలోకి దిగింది. 

read more  నిండు గర్భిణీ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి...

అయితే వీరిని గమనించిన బీచ్ లో ఉన్న ప్రజలు చూసి వెంటనే రక్షించి పోలీసులకు అప్పజెప్పారు. వీరిని త్రీటౌన్ సీఐ కోదాడ రామారావు ఎదుట హాజరుపరచగా వారి కుటుంబ సభ్యులను పిలిపించి అవగాహన కల్పించి పంపి వేసారు. భర్త వ్యసనాలకు బానిసై ప్రతిరోజు వేధిస్తుండటంతో, బాధలు తట్టుకోలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు