ఐఎఎస్, ఐపీఎస్ లే అసాధ్యమన్నా...జగన్ చేసి చూపించారు: మంత్రి అవంతి

By Arun Kumar PFirst Published Jun 9, 2020, 10:32 AM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన ఎంతో బాగుందని, ప్రజలకు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుపోతున్నారని రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. 

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన ఎంతో బాగుందని, ప్రజలకు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుపోతున్నారని రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయాలన్న తపనతో వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారని తెలిపారు. 

''తన ఏడాది పాలనలో సీఎం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బాగున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లక్షల సచివాలయ ఉద్యోగాలిచ్చిన ఏకైక సీఎంగా పేరు తెచ్చుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంది'' అని అన్నారు. 

read more   విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ఆగని చావులు... మరొకరి మృతి

''కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సంక్షేమ పథకాల అమలు అసాధ్యమని చెప్పినా... వాటిని ప్రజలకు అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తున్నారు'' అని  తెలిపారు. 

 రాష్ట్రంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు వైసిపి పాలనలోనే వేగవంతమయ్యాయి. అటువంటిది తమ నేతపై పప్పు తభలా బ్యాచ్ పనికట్టుకొని అరోపణలు చెయ్యడం దురదృష్టకరమని అవేదన వ్యక్తం చేశారు. లోకేష్ విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో బాదితులకు ఓదార్చేందుకు రాలేదుకానీ ఇప్పుడు అవాకులు చెవాకులు  వాగుతున్నాడని మంత్రి అవంతి మండిపడ్డారు. 
 

click me!