విశాఖ: కారులో శవమై తేలిన తెలంగాణ వ్యాపారి

By Siva Kodati  |  First Published Oct 27, 2019, 2:11 PM IST

విశాఖలో వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. మధురవాడకు చెందిన శివరామకృష్ణారెడ్డి అనే వ్యాపారి కారులో శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శివరామకృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.


విశాఖలో వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. మధురవాడకు చెందిన శివరామకృష్ణారెడ్డి అనే వ్యాపారి కారులో శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శివరామకృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మృతుడి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా. ఇతనిపై గతంలో చీటింగ్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శివరామకృష్ణారెడ్డి ఆత్మహత్య పలు అనుమానాలను కలిగిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos

undefined

కొద్దిరోజుల క్రితం విశాఖపట్టణంలోని గుడ్లవానిపాలెంలో  శుక్రవారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీక్ చేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన  విశాఖలో సంచలనం సృష్టించింది.

Also Read:విషాదం: గ్యాస్ లీక్ చేసుకొని తండ్రి సహా ఇద్దరు పిల్లల సూసైడ్

గుడ్లవానిపాలెంలో ఉమా మహేశ్వర్ రావు, ఆయన కొడుకు సతీష్ చంద్ర, కూతురు లావణ్యలు గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో మృతి చెందారు.అయితే తొలుత ఈ ఘటనను అంతా  ప్రమాదంగా భావించారు. కానీ, ఉద్దేశ్యపూర్వకంగానే గ్యాస్ సిలిండర్ ను లీక్ చేసుకొని వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు.

ఆత్మహత్యను తాము ఎలా ప్లాన్ చేసుకొన్నారో సతీష్ చంద్ర, లావణ్య మినిట్ మినిట్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నోట్ ఆధారంగా ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

పేలుడు సంబవించిన వెంటనే  స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే సమయంలోనే లావణ్యతో పాటు సతీష్ చంద్ర మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమామహేశ్వర్ రావు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.అయితే ఉమా మహేశ్వర్ రావుతో పాటు ఆయన కొడుకు, కూతురు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Also ReadGబెంగళూరులో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య: కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన శ్రీహర్ష... బెంగళూరులోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.

హాస్టల్‌లో సరైన మౌలిక వసతులు లేవని యజమాన్యంపై శ్రీహర్ష ప్రశ్నించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలేజీ యాజమాన్యం శ్రీహర్షను సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న సంఘటనలతో మనోవ్యధకు గురైన విద్యార్ధి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని బలవన్మరణంతో విద్యార్ధులు భగ్గుమన్నారు. కాలేజీ యాజమాన్యం తీరు వల్లే శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆందోళనకు దిగారు.

కళాశాల, హాస్టల్‌లో సరైన నీరు, మంచి భోజనం లభించడం లేదన్న కారణంతో శ్రీహర్ష పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు అతడిపై పగ పెంచుకుని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని.. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లు, విద్యార్ధులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి మరణంతో శ్రీహర్ష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!