ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులు... శానిటైజర్ తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Sep 15, 2020, 10:28 AM IST
ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులు... శానిటైజర్ తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

సారాంశం

నడిరోడ్డుపై ఎమ్మెల్యే అనుచరుడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. 

విశాఖపట్నం:  విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుడొకరు అరాచకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై ఎమ్మెల్యే అనుచరుడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం విశాఖలో చోటు చేసుకుంది. బాధితురాలి కొడుకు నరేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు.  

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఎస్తేరు రాణి అనే మహిళ రోడ్డు పక్కన హోటల్‌ నడుపుతుంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ అనే వ్యక్తి తరచూ సదరు బాధిత మహిళ హోటల్ వెళ్లేడమే కాకుండా.. అక్కడ హోటల్ కొనసాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని బెదిరించేవాడు. అంతేగాక తనతో సన్నిహితంగా ఉండకపోతే లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టు ఎస్తేరు రాణి పై తప్పుడు కేసు పెడతానని బెదిరించేవాడట. 

read more  కర్నూల్ జిల్లాలో విషాదం: బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారుల మృతి

ఈ నేపథ్యంలోనే నిన్న(ఆదివారం) సాయంత్రం కూడా బాధితురాలిని తనతోనే ఉండాలని బెదిరించాడు. అంతేగాక నడి రోడ్డుపైనే ఆమెపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో జరిగిన ఈ అవమానం తట్టుకోలేక సదరు బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే స్థానికులు ఆమెను కింగ్ జార్జీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె భావనగర్ వార్డులో చికిత్స పొందుతోంది ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 

ఈ ఘటనపై బాధితురాలి కొడుకు నరేష్‌ తన తల్లిపై జరిగిన దౌర్జన్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన ఈగల సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నరేష్‌ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు