పౌరసత్వ సవరణ బిల్లుకు తూట్లు పొడవాలని కొందరు బావిస్తున్నారని... వారి ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలు, బిజెపి నాయకులు, కార్యకర్తలపై వుందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
విశాఖపట్నం: రాజకీయ అంటరానితనం అత్యంత ప్రమాదకరమని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నాయకులు సిహెచ్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఈ దేశానికి ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఆదివారం ఉదయం భారతీయ జనతా పార్టీ విశాఖ నగర కార్యాలయంలో నగర జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టానికి కొంతమంది తూట్లు పొడవడానికి ప్రయత్నిస్తున్నారని... అది చెల్లదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల సంఖ్య అధికంగా పెరిగిపోతుండడంతో దేశంలోని సంఘ విద్రోహ శక్తులు పేట్రేగి పోయే ప్రమాదం ఉందన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ సిటిజన్ షిప్ రూపొందించడం జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసే ఈ నిర్ణయం దేశ సమైక్యతను సార్వభౌమత్వాన్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ విశ్వసించాలి అన్నారు.
undefined
read more పౌరసత్వ సవరణ బిల్లుపై కేంద్రానికి బుద్ది చెప్పాలి: అసద్
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో చొరబాట్లు సంఖ్య గురించి గతంలోనే అనేక మంది ప్రముఖ రాజకీయ ప్రముఖులు అనేక విధాలుగా తెలియజేసే ప్రయత్నం చేశారని... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికి ఇది కార్యరూపం దాల్చడం ప్రతి సిటిజన్ గౌరవించాల్సిన విషయమని అన్నారు.
ప్రజల్లో పౌరసత్వ సవరణ చట్టం గురించి వస్తున్నటువంటి అనుమానాలకు తావు లేకుండా బిజెపి నాయకులు అంతా దీనిపై కృషిచేయాలని పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని సాధించాలంటే తప్పనిసరిగా కలిసి వచ్చే వారిని అందరినీ కలుపుకొని తీరాలని ఆయన పిలుపునిచ్చారు.
read more బీజేపీ కొత్త సారథి ఎవరు?: పోటీదారులు వీరే, కమలం ప్లాన్ ఇదీ...
దేశం కోసం ఆలోచించే ప్రతి వ్యక్తి ఈ విషయంలో దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీని పటిష్టం చేయడానికి కలిసి వచ్చే వారందరినీ పార్టీ ఈ విధానమైన సాంస్కృతిక ఐక్యతను పెంపొందించే దిశలో నాయకులంతా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కంభంపాటి హరిబాబు, నగర అధ్యక్షులు నాగేంద్ర, మాజీ శాసన మండలి సభ్యులు పీవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.