కార్తీకమాసం: 12న విశాఖలో జ్ఞాన దీపోత్సవ సభ

By Prashanth MFirst Published Nov 11, 2019, 4:28 PM IST
Highlights

కార్తీకమాసం పురస్కరించుకొని విశాఖలో  ఈ నెల 12న ఎం.వి.పి.కాలనీ లో గల టిటిడి కళ్యాణ మండపంలో  జగద్గురు శంకరాచార్య గోవర్ధన మఠం పూరీ పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి ఆధ్వర్యంలో జ్ఞాన దీపోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త పి.శ్రీనివాస బంగారయ్య శర్మ తెలియజేసారు.

పవిత్ర కార్తీకమాసం పురస్కరించుకొని విశాఖలో  ఈ నెల 12న ఎం.వి.పి.కాలనీ లో గల టిటిడి కళ్యాణ మండపంలో  జగద్గురు శంకరాచార్య గోవర్ధన మఠం పూరీ పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి ఆధ్వర్యంలో జ్ఞాన దీపోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త పి.శ్రీనివాస బంగారయ్య శర్మ తెలియజేసారు.

also read: పండ్లతో దుర్గామాత అలంకరణ: విశాఖలో బారులు తీరిన జనం

సోమవారం హోటల్ మేఘాలయ లో రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూరీ పీఠాధిపతి తొలిసారిగా  ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఆయన  విశాఖ,విజయవాడ,తిరుపతి, హైదరాబాద్ నగరాలలో పర్యటన కొనసాగిస్తారని పేర్కొన్నారు.

ఈ నెల 12న ఆయన మొదటిసారి గా విశాఖకు వచ్చి రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటనను కొనసాగిస్తారని వెల్లడించారు. 12 న మంగళవారం తెల్లవారు జామున స్వామి  నిశ్చలానంద విశాఖ కు వచ్చి మొదటిగా రఘు ఇంజినీరింగ్ కాలేజి ప్రాంగణంలో నిర్వహించే ఆధ్యాత్మిక, గణిత ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు

సాయంత్రం 5 గంటలకు ఎం.వి.పి.కాలనీ లో గల టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించే జ్ఞాన దీపోత్సవ సభలో భసక్తులను ఉద్దేశించి  ఆధ్యాత్మిక ఉపన్యాసం,అనుగ్రహ భాషణ చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో రఘు విద్యా సంస్థల చైర్మన్ కలిదిండి రఘు, కార్యక్రమం జాతీయ కో-ఆర్డినేటర్ లు పి.సి.జా, తురగ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

click me!