సాధారణంగా హిందూ వివాహాల్లో పెళ్లిళ్లు మగవారే పూజారులుగా వ్యవహరిస్తారు. అయితే... అందుకు భిన్నంగా ఓ మహిళ వేదమంత్రాలు వళ్లవిస్తూ పెళ్లి చేయడం విశేషం. బ్రమరాంబ మహేశ్వరి అనే మహిళ పెళ్లి పంతులు పాత్రను అద్భుతంగా పోషించింది.
మీరు ఇప్పటి వరకు చాలా పెళ్లిళ్లు చూసి ఉంటారు. పెళ్లికి ఎవరు వచ్చినా... అమ్మాయి ఏ చీర కట్టుకుంది..? ఏ నగ పెట్టుకుంది..? వధూవరుల జంట ఎలా ఉంది... వీటి గురించే మాట్లాడుకోవం విని ఉంటారు. కానీ ఓ పెళ్లిలో మాత్రం పెళ్లిచేసే పూజారి గురించే చర్చంతా. ఎందకంటే... ఆ పెళ్లి చేసింది ఓ మహిళా పూజారి కావడం విశేషం.ఈ పెళ్లి చెన్నైలో చోటుచేసుకుంది
పూర్తి వివరాల్లోకి వెళితే... సాధారణంగా హిందూ వివాహాల్లో పెళ్లిళ్లు మగవారే పూజారులుగా వ్యవహరిస్తారు. అయితే... అందుకు భిన్నంగా ఓ మహిళ వేదమంత్రాలు వళ్లవిస్తూ పెళ్లి చేయడం విశేషం. బ్రమరాంబ మహేశ్వరి అనే మహిళ పెళ్లి పంతులు పాత్రను అద్భుతంగా పోషించింది. తెలుగు అమ్మాయి సుష్మా హరిని, తమిళ అబ్బాయి విఘ్నేశ్ రాఘవన్‌ల పెళ్లికి మహేశ్వరి పూజారిగా మారడం అక్కడకి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది.
undefined
Also Read బరువు తగ్గడానికి ట్యాబ్లెట్స్ మింగిన డ్యాన్సర్.. కొద్దిసేపటికే....
చెన్నై శివారు ప్రాంతమైన దక్షిణ చిత్రలో ఈ వేడుకను నిర్వహించారు. మైసూర్‌కు చెందిన బ్రమరాంబ వేద విద్యలో నిష్ణాతురాలు. గతంలో ఆమె ఎన్నో పెళ్లిల్లు కూడా చేశారు. వాస్తవానికి ఈ పెళ్లి కోసం మహిళా నాదస్వర, మృదంగ బృందాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ వారికి ఆ బృందాలు దొరకలేదు.
కానీ మహిళా పూజారి బ్రమరాంబ నిర్వహించిన పెళ్లి తంతు .. ఆ పెళ్లికి హాజరైన వారిని ఆకట్టుకున్నది. పూజారి తన మంత్రాలను ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి ఆ దంపతులకు వివరించారు. పెళ్లికి వచ్చిన అతిథులు.. పూజారి బ్రమరాంబ వివరాలు సేకరించారు. మహిళా పూజారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో బ్రమరాంబను ఆహ్వానించినట్లు పెళ్లి నిర్వాహకులు తెలిపారు.