రెండో ప్రపంచ యుద్ధం విడదీసింది.. 78ఏళ్ల తర్వాత కలిసిన అక్కాచెల్లెళ్లు

By telugu teamFirst Published Feb 8, 2020, 3:10 PM IST
Highlights

వీరి ప్రేమను చూసి కుటుంబసభ్యుల కళ్ల వెంట కూడా ఆనంద భాష్పాలు వచ్చాయి. ఈ సందర్భంగా రోజాలిని మాట్లాడుతూ... చాలా కాలం నుంచి తన చెల్లెలి కోసం వెతుకుతూనే ఉన్నానని చెప్పడం విశేషం.

వాళ్లిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు.. ఒక తల్లికి పుట్టి.. కలిసి పెరిగిన ఈ అక్కాచెల్లెళ్లు అనుకోకుండా విడిపోయారు. మళ్లీ 78 ఏళ్ల తర్వాత ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. ఈ సంఘటన మాస్కోలో చోటుచేసుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ అక్కాచెల్లెళ్లు విడిపోయారు. ఆ తర్వాత ఓ టీవీ కార్యక్రమం, పోలీసుల సహకారంతో 78ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోగలిగారు. చాలా కాలం తర్వాత కలుసుకున్న యులియా(92), రోజాలిని ఖరితోనోవా(94)లు ఒకరిపై మరొకరు ప్రేమ కురిపించుకున్నారు.

Also Read పీరియడ్స్ వస్తే.. మైనర్ అయినా పెళ్లి కి ఒకే .. కోర్టు షాకింగ్ తీర్పు...

వీరి ప్రేమను చూసి కుటుంబసభ్యుల కళ్ల వెంట కూడా ఆనంద భాష్పాలు వచ్చాయి. ఈ సందర్భంగా రోజాలిని మాట్లాడుతూ... చాలా కాలం నుంచి తన చెల్లెలి కోసం వెతుకుతూనే ఉన్నానని చెప్పడం విశేషం.

ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లిదండ్రులతో కలిసి స్టాలిన్ గ్రాడ్ లో ఉండేవారు. అయితే నాజీ సైన్యం వీరున్న నగరాన్ని చుట్టుముట్టింది. దీదంతో 1942లో ఇక్కడి పౌరులను అధికారులు ఖాళీ చేయించారు. వారిని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  యులియాను ఆమె తల్లితో కలిపి పెంజా నగరానికి తరలించారు. రోజాలినాను ఆమె పనిచేస్తున్న కర్మాగారంలోని సహచర కార్మికులతో కలిపి చెల్యాబిన్స్క్ నగరానికి పంపారు.

అలా విడిపోయిన ఈ ఇద్దరు సోదరీమణులు తాజాగా కలుసుకున్నారు. యులియా కుమార్తె... తమ పెద్దమ్మ ఆచూకీ కావాలంటూ మీడియాను, పోలీసులను ఆశ్రయించడంతో.. వారి సహాయంతో ఇప్పటికైనా కలుసుకోగలగడం గమనార్హం. ప్రస్తుతం వీరికి సంబంధించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

click me!