‘విడాకులు తీసుకున్నా.. నా పెళ్లి ఫొటోలు వేస్ట్ అయ్యాయి.. కాబట్టి రీఫండ్ ఇవ్వు..’ అంటూ ఓ మహిళ ఫొటోగ్రాఫర్ మీద దావా వేసింది. విచిత్రమైన ఈ కేసు గురించి వివరాలేంటంటే..
ఇంటర్నెట్ లో చాలా చిత్రవిచిత్రమైన కథనాలు కనిపిస్తుంటాయి. కొన్ని కథనాలైతే అస్సలు నమ్మడానికి వీలు లేనివి కూడా ఉంటాయి. అలాంటి ఓ విచిత్రమైన కథనానికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక్కోసారి మనుషులు ఎలా స్పందిస్తారో.. ఎంత అసహజంగా.. లాజిక్ లేకుండా బిహేవ్ చేస్తారో తెలిపే ఘటన ఇది.
ఇది చదివిన తరువాత.. మీరు కూడా.. వార్నీ.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? ఇలా కూడా ఆలోచించొచ్చా.. అనుకుంటారు. ఇంతకీ విషయం ఏంటంటే.. లాన్స్ రోమియో అనే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ట్విట్టర్‌లో ఓ వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్షేర్ చేశాడు. అందులో ఉన్నది చదివితే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. మీరు పూర్తిగా షాక్ లోకి వెడతారు.
undefined
రోమియో క్లయింట్‌లలో ఒకరు తన డబ్బులు రీఫండ్ చేయమంటూ అతడిని కాంటాక్ట్ చేయడంతో కథ ప్రారంభమైంది. ఆమె.. ఇటీవల రోమియోను వాట్సాప్ లో కాంటాక్ట్ చేసి.. 2019లో జరిగిన తన పెళ్లిలో రోమియో ఫోటోగ్రాఫర్‌గా ఫొటోలు తీశాడని, అయితే ఇప్పుడు తాము విడాకులు తీసుకున్నాం. కాబట్టి తనకు ఆ డబ్బులు తిరిగి కావాలని ఆ మహిళ పేర్కొంది.
దీంతో షాక్ అవ్వడం రోమియో వంతయ్యింది. అది ప్రాంక్ ఏమో అనుకున్నాడు. కానీ చివరికి నిజమేనని తేలింది. దీన్ని అతను...
"నా జీవితంలో సినిమాలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటితో నేను ప్రమాణం చేస్తున్నాను" అని ఫోటోగ్రాఫర్ సంభాషణ స్క్రీన్‌షాట్‌లను ఉన్న పోస్ట్‌కు శీర్షిక పెట్టారు. అందులో ఆమె రోమియోను సంప్రదించడం.. ఫొటోలకు తాము చాలా ఖర్చు పెట్టామని, అతను కూడా బాగా తీశాడని చెప్పుకొచ్చింది. అయితే తామిప్పుడు డైవర్స్ తీసుకున్నందున ఆ ఫొటోలు ఎందుకూ పనికిరావని.. అతను వాపస్ తీసుకుని తమ డబ్బులు రీ ఫండ్ చేయాలని కోరింది.
విచిత్రంగా అనిపిస్తుంది కదా.. నిజ్జంగా నిజం. దీనికి అతను అలా రీఫండ్ ఉండదని నచ్చజెప్పబోతే.. సరే అయితే మా లాయర్ నిన్ను కలుస్తాడంటూ సీరియస్ అయ్యింది. అమె తన విచిత్రమైన డిమాండ్‌పై స్థిరంగా ఉండి, రోమియోపై దావా వేయబోతున్నట్లు చెప్పింది.
ఆ తరువాత ఆమె లాయర్ కూడా రోమియోను సంప్రదించాడు. కానీ అతను తన క్లయింట్ ప్రవర్తనకు విపరీతంగా నవ్వుకున్నాడు. తనను కూడా ఆ తరువాత రీఫండ్ అడుగుతుందని జోకులు కూడా వేశాడట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మహిళ మాజీ భర్త.. ట్విట్టర్ లో ఈ స్టోరీ చూసి రోమియోను కాంటాక్ట్ అయ్యాడు.
ఆమె ప్రవర్తనకు ఫోటోగ్రాఫర్ కు క్షమాపణ చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ హృదయపూర్వకంగా కాసేపు సంభాషించుకున్నారు. అదండీ.. అలాంటి వాళ్లు కూడా ఉంటారు. దీనికి సంబంధించి ఈ ట్విట్టర్ లింక్ చూడండి..
I swear my life is a movie 🤦🏽♂️🤣 you can't make this stuff up.
ThaboBesterArrested Musa xoli Boity
Pretoria East Dr Pashy Ananias Mathe Venda Bonagni Fassie Midrand Stage 5 Andile Costa Gayton Langa Penuel pic.twitter.com/3RKTkY1OkD