వైరల్ వీడియో: అన్న ప్రేమ.. వాన నుంచి చెల్లిని ఎలా కాపాడాడో చూడండి..

By Mahesh Rajamoni  |  First Published Apr 30, 2023, 11:19 AM IST

అన్నకు, చెల్లికి ఉన్న అనుబంధం ఎన్నటికీ విడదీయ రానిది. చెరిగిపోనిది. ఎన్ని కష్టాలొచ్చినా సరే చెల్లికి ఏ కష్టంగా రాకుండా చూసుకుంటారు. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే? 


అన్న, చెల్లెల్లి మధ్యన ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు వెలకట్టలేం.  చెల్లెల్లి కోసం ఎన్ని కష్టాలనైనా పడుతుంటారు అన్నలు. తనకు కష్టం వచ్చినా చెల్లెలు మాత్రం సంతోషంగా ఉండాలనుకుంటారు అన్నలు. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అన్న తన చిన్ని చెల్లెల్ని వాన నుంచి ఎలా కాపాడాడో ఈ వీడియోలో ఉంది. 

He is wonderful brother, she is so lucky. pic.twitter.com/XEy9RLfLsU

— CCTV IDIOTS (@cctvidiots)

సీసీటీవీ ఇడియట్స్ అనే పేజీ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. 12 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ లో వర్షం పడుతుండటంతో ఓ బాలుడు కారులోకి వెళ్లేందుకు పరుగెత్తుతాడు. అయితే తను ఒక్కడే కాదు ఆ బాలుడు తన టీ షర్ట్ లో  తన చిన్న చెల్లిల్ని దాచుకుంటాడు. వానకు తడవకుండా. వర్షం నీరు ఆమెపై పడకుండా చేతుల్లో ఎత్తుకుని తన టీషర్ట్ లో ఆమె తలను పెడతాడు. ఈ వీడియోను చూసిన వాళ్లంతా చెల్లెలిపై అన్నకు ఎంత ప్రేమో అంటూ ఆ బాలుడిని తెగ మెచ్చుకుంటున్నారు.

Latest Videos

undefined

ఇక ఆ బాలుడు కారు లోపలి కూర్చున్న తర్వాత తన చెల్లిని టీ షర్ట్ లోంచి బయటకు తీసి ఆమె జుట్టును సవరిస్తాడు. దీంతో ఆ చెల్లెలు క్యూట్ గా నవ్వుతుంది. ఈ వీడియోకు ‘అతను అద్బుతమైన సోదరుడు. ఆమె చాలా అదృష్టవంతురాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. 

ఈ వీడియోను ఆన్ లైన్ లో షేర్ చేయగా 16.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా యూజర్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అన్నా చెల్లెలి అనుబంధం ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేస్తున్నారు.    

click me!