హోమ గుండం చుట్టూ..నెమ్మదిగా ప్రదక్షణలు చేస్తున్న వధూవరులను ఆ పంతులు గారు తొందరపెడుతున్నారు. నడవడం కాదు.. పరిగెత్తండి.. పరిగెత్తండి అంటూ చెబుతున్నాడు
హిందూ సాంప్రదాయం ప్రకారం.. పెళ్లి అనేది ఒక్క చిన్న తంతు కాదు. ఆచారాలు, సంప్రదాయాలు, పట్టింపులు అంటూ... కొన్ని గంటలపాటు సాగుతుంది. కొందరి వివాహాలు.. ఉదయం పూట జరిగితే.. మరికొందరివి మాత్రం.. అర్థరాత్రి జరుగుతూ ఉంటాయి. ఇంకొదరికి ఏకంగా రాత్రి పూట మొదలై.. తెల్లవారు జాము వరకు సాగుతూనే ఉంటాయి.
ఇటీవల ఓ జంట పెళ్లి విషయంలోనూ అదే జరిగింది. తెల్లవారుజామున ముహూర్తం... అప్పటికే ఉదయం 3 గంటలు అవుతోంది.. ఇంకా పెళ్లి తంతు ముగియలేదు. తొందర తొందరగా పెళ్లి చేసేసి.. ఇంటికి వెళ్లిపోవాలని పంతులు ఆలోచన. అందుకే.. హోమ గుండం చుట్టూ..నెమ్మదిగా ప్రదక్షణలు చేస్తున్న వధూవరులను ఆ పంతులు గారు తొందరపెడుతున్నారు. నడవడం కాదు.. పరిగెత్తండి.. పరిగెత్తండి అంటూ చెబుతున్నాడు. కాగా.. ఆయన చెబుతున్న దానికి వధూవరులు సహా.. బంధువులంతా నవ్వేయడం గమనార్హం.
undefined
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను 'వెడబౌట్' అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హోమ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వధూవరులను అయ్యగారు.. పరిగెత్తండి.. పరిగెత్తండి అంటూ తొందర పెట్టారు. కాగా.. ఇలాంటి పంతులు ఉంటే.. పెళ్లి సరదాగా జరుగుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. అప్పటికే సమయం 3 దాటడంతో.. అయ్యగారు వారిని అలా తొందర పెట్టడం గమనార్హం.
ఈ వీడియోని పోస్టు చేసిన అతి కొద్ది సమయంలోనే 20వేల వ్యూస్, 900 లైకులు రావడం గమనార్హం.