వైరల్ వీడియో : కోతికి కుక్క సాయం.. రెండూ తోడు దొంగలే..!

By telugu news teamFirst Published May 21, 2022, 9:32 AM IST
Highlights

ఓ కోతి పిల్లకు దుకాణంలోని చిప్స్ ప్యాకెట్ కావాలి. దానికేమో అందదు. అందుకే.. దానికి ఓ కుక్క సాయం చేసింది. ఆ కుక్క మీదకి ఎక్కి.. కోతి పిల్ల.. చిప్స్ ప్యాకెట్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. 

అందరి చేతికీ స్మార్ట్ ఫోన్లు, అందులో ఇంటర్నెట్ సదుపాయం,  సోషల్ మీడియా వాడటం చాలా కామన్ అయిపోయింది. ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత... ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. ఎక్కడో ఏ మూలలోనో ఏం జరిగినా కూడా... ఈ స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పుణ్యమా అని అందరికీ తెలిసిపోతోంది. అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను కూడా మనం చాలానే చూశాం. వాటిలో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని హార్ట్ టచింగ్ గా కూడా అనిపించి ఉండొచ్చు. కాగా..  తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియో ఎప్పుడు, ఎవరు, ఎక్కడ తీశారో క్లారిటీ లేదు కానీ.. వీడియో చూసినవారంతా నవ్వుకుంటున్నారు. ఓ కోతి పిల్లకు దుకాణంలోని చిప్స్ ప్యాకెట్ కావాలి. దానికేమో అందదు. అందుకే.. దానికి ఓ కుక్క సాయం చేసింది. ఆ కుక్క మీదకి ఎక్కి.. కోతి పిల్ల.. చిప్స్ ప్యాకెట్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. తోడు దొంగల్లా రెండూ కలిసి.. చిప్స్ ప్యాకెట్ చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటోంది.

 

The 🐒 trying to pick up a packet of chips with the help of 🐕 is the cutest thing you will watch today ❣️❣️. pic.twitter.com/bkMAEU13NC

— Tarana Hussain (@hussain_tarana)

నిజానికి ఈ వీడియో గతేడాది డిసెంబర్ లో పోస్టు చేశారు. అయితే.. ఇప్పుడు ఈ వీడియో మరోసారి వైరల్ గా మారడం గమనార్హం. ఈ వీడియోని కొందరు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ‘‘ కోతి, కుక్క స్నేహితులు కావు అని ఎవరు చెప్పారు..?’’ అంటూ క్యాప్షన్ జోడించారు.

ఈ వీడియోకి లైకుల వర్షంతో పాటు.. కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది. ఈ వీడియోకి చాలా మంది తమ స్నేహితులను ట్యాగ్ చేస్తుండటం గమనార్హం. కొందరేమో.. టీమ్ వర్క్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికీ కోతి, కుక్కకు వైరమని అందరూ చెబుతూ ఉంటారు. కానీ... ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మాత్రం.... అవి తప్పు అని తెలుస్తూ ఉంటుంది.

click me!