ఈ వీడియో ఆ జంట టిక్ టాక్ లో షేర్ చేయగా... టిక్ టాక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయాన్ని కూడా సదరు వ్యక్తి వివరించడం గమనార్హం.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చిన్న చిన్న సంఘటనలు కూడా నెట్టింట ప్రత్యక్షమౌతున్నాయి. అవి కాస్త ఫన్నీగా ఉంటే చాలు.. వెంటనే వైరల్ గా మారిపోతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారింది. ఓ వ్యక్తి.. ఓ చిన్న కాలువ దాటాల్సి ఉండగా.. పొరపాటున ఆ కాలువలో పడిపోయాడు. దాని మొత్తాన్ని అతని భార్య వీడియో తీసింది. ఆ సంఘటన చూసి ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఆ జంట టిక్ టాక్ లో షేర్ చేయగా... టిక్ టాక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయాన్ని కూడా సదరు వ్యక్తి వివరించడం గమనార్హం.
లీయూస్ అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అయితే.. అతను భార్యతో కలిసి సరదాగా నడుస్తున్నాడు. ఈ క్రమంలో అతని భార్య.. అతనిని.. షార్ట్ కర్ట్ లో తీసుకువెళతానని చెప్పిందట. వెంటనే అతను కూడా వెనకే వెళ్లాడు. అక్కడ.. ఓ చిన్న కాలువ దాటాల్సి వచ్చింది.
బుదర అంటుకుంటోందని.. అతను చెప్పులు చేతపట్టుకొని.. దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో.. ఆ బురద కాలువలో పూర్తిగా పడిపోయాడు. కొంచెం కాదు.. పూర్తిగా బురదలో పడిపోయాడు. దానిని అతని భార్య వీడియో తీసి టిక్ టాక్ లో షేర్ చేయగా.. 28మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. కావాలంటే.. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.