చిరుతపులి పిల్లను మొసలి నోట కరచుకొని లాక్కెళ్లిన వీడియోను సమీపంలో దక్షిణాఫ్రికా వైల్డ్ ఎర్త సఫారీ గైడ్ బుసాని మాలీ వీడియో తీసి దాన్ని నెట్ లో పెట్టారు.
ఓ చిరుతపులి పిల్ల నీళ్లు తాగేందుకు కుంట వద్దకు రాగా ఓ భారీ మొసలి చిరుతను భారీ మొసలి లాక్కెళ్లింది. ఈ సంఘటన దక్షిణాఫ్రికా దేశంలోని నైలు నదీ తీరంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మగ చిరుతపులి పిల్ల నీళ్లు తాగేందుకు నైలునది సమీపంలోని కుంట ఒడ్డు వద్దకు వచ్చింది.
చిరుతపులి పిల్ల నీరు తాగేందుకు తిరుగుతుండగా నీళ్లలో దాగి ఉన్న 13 అడుగుల పొడవున్న పెద్ద మొసలి ఒక్క సారిగా లంఘించి చిరుతపులి పిల్లను నోట కరచుకొని నీటిలోపలకు లాక్కెళ్లింది. చిరుతపులి పిల్లను మొసలి నోట కరచుకొని లాక్కెళ్లిన వీడియోను సమీపంలో దక్షిణాఫ్రికా వైల్డ్ ఎర్త సఫారీ గైడ్ బుసాని మాలీ వీడియో తీసి దాన్ని నెట్ లో పెట్టారు.
నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపులిపిల్లను పెద్ద మొసలి లాక్కెళ్లడం బాధకరమైన ఘటన అని గైడ్ పేర్కొన్నారు. తన పిల్ల చిరుతను మొసలి నోటకరచుకొని వెళ్లడంతో ఒడ్డుపై తల్లి చిరుత బాధతో అటుఇటు తిరిగింది. చిరుతపిల్లను నోట కరచుకొని వెళ్లిన మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నైలు నదిలో ఉన్న పెద్ద మొసళ్లు శక్తివంతమైనవని, అవి దూకుడుగా వ్యవహరిస్తాయని గైడ్ చెప్పారు.