మానవత్వం మెరిసింది.. ఆయన సహాయం అందరి హృదయాలను గెలిచింది!

By Rekulapally SaichandFirst Published Jan 3, 2020, 4:41 PM IST
Highlights

 మానవత్వం పరమళిచింది .ఓ వృద్ధుడు పిల్లిని కాపాడిన వీడియో సామాజి మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఓ పిల్లికి అతడు సహయం అందరి హృదయాలను గెలుచుకుంది. 

తోటి మనుషులనే పట్టించుకుని ఈ సమాజంలో  ఆపదలో ఉన్న ఓ పిల్లిని కాపాడి తన మానవత్వాన్ని నిరూపించుకున్నాడు ఓ వృద్ధుడు. ఇంటి పైకప్పుపైనుండి కిందకు దూకడానికి పతమవుతున్న  పిల్లిని కూర్చీ సహయంతో దానికి కిందకు దించి  తన మానవత్వాన్ని నిరూపించుకున్నాడు. ప్రస్తుత్తం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఓ పిల్లి విధంతా తిరుగుతూ అనుకోకుండా ఓ ఇంటిపైకి ఎక్కింది. ఎక్కడమైతే ఎక్కింది కానీ కిందికి దిగడం మాత్రం రావడం లేదు.  పైకప్పు నుంచి దూకాడానికి ప్రయత్నిస్తున్న దానికి సాద్యపడడం లేదు.  కిందికి దూకాడానికి కష్టపడుతున్న ఆ పిల్లిని చూసి ఓ పెద్దాయన చలించాడు.   

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Kindness is the best form of humanity. There is still hope....Humanity survives. 🙏#happynewyear #2020goals

A post shared by Madhur Bhandarkar (@imbhandarkar) on Jan 2, 2020 at 12:44am PST

ఎలాగైన దాన్ని సహయం చేయాలనుకున్న ఆయన ఓ కుర్చీని  పైకి ఎత్తి  దాని ముందు ఉంచాడు. అది మెల్లగా కూర్చీ మీదకు దిగగానే దాన్ని స్లోగా కిందకు దించాడు. దీంతో ఆ పిల్లి కూర్చీ పైనుంచి దిగి అక్కడి నుంచి పారిపోయింది. 

దీనికి సంబంధించిన వీడియోను దర్శకుడు మధుర్ భండార్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. "దయ అనేది మానవత్వానికి ఉత్తమ రూపం" లనే క్యాప్షన్ ‌ను జత చేశారు.  ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆ పెద్దాయిన పిల్లికి చేసిన సహాయం అందరి ప్రశంసలను పోందుతోంది. ఈ వీడియోను విపరీతంగా షేర్ల్ చేస్తున్నారు నెటిజన్స్.  ఈ వీడియోను పోస్ట్ చేసిన  24 గంటల్లోనే 1.8 మిలియన్ల వ్యూస్ లభించాయి. 

click me!