న్యూ ఇయర్ వేడుక పలు జంతువులకు కాల రాత్రి చేసింది. పలువురు ఆనందంతో పేల్చిన టపాకాయలు వాటి ప్రాణాలను తీశాయి. జర్మనీలో జరిగిన సంఘటనలో డజన్ల సంఖ్యలో గొరిల్లాస్, ఒరంగుటాన్స్ సహా చింపాంజీలు మృతివాత పడ్డాయి.
మనిషి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఈ భూప్రపంచం ఏదో తనకే సొంతమయినట్లు ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరిస్తున్నాడు. అభయారణ్యాల్లో బిక్కుబిక్కుమంటూ తలదచుకుంటున్న అటవి జంతువులను వెటాడి వెంటాడి ప్రాణాలు తీస్తున్నాడు. వాటి స్వేచ్చ ప్రపంచాన్నివిడి చివరకు జూలో బంధిగైనా బతుకుదాం అనుకుంటున్న అక్కడ కూడా వాటిని విడిచిపెట్టడం లేదు. తాజాగా న్యూఇయర్‌కు వెల్ కాం చెబుతూ జర్మనిలోని కొందరి హంగామా పలు జంతువుల ప్రాణాలు తీశాయి
కొత్త సంవత్సరం సందర్భంగా జర్మనీలోని వెస్ట్రన్ జర్మన్ సిటీ అఫ్ క్రేఫిల్డ్ జూలో విషాదం చోటుచేసుకుంది. జూలో జరిగిన ఆగ్నీ ప్రమాదంలో అక్కడి అనేక మూగ జీవాల ప్రాణాలు కోల్పొయాయి. ఈ ఘటనలో డజన్ల సంఖ్యలో గొరిల్లాస్, ఒరంగుటాన్స్ సహా చింపాంజీలు మృతివాత పడ్డాయి.
undefined
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జూలో చైనాకు చెందిన స్కై లాంతర్ల పేల్చడంతో మంటలు చెలరేగి జూ మెుత్తం వ్యాపించాయి ఎన్ క్లోజర్స్‌లోని జంతువులకు ఆ మంటలు అంటుకున్నాయి. దీంతో పదుల సంఖ్యలో జంతవులు మృతి చెందాయి.
ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పదుల సంఖ్యలో జంతువులు అగ్నీకి అహుతి అయిపోయాయి. "జూలోని జంతువుల పట్ల ఎలాంటి భయంతోనైతే ఉన్నామో చివరకు అదే జరిగిపోయింది. కోతి జాతికి చెందిన ఎన్ క్లోజర్స్‌లో ఉన్న జంతువులు అన్ని మరిణించాయి" అంటూ జూ పర్యవేక్షకులు ఫేస్ బుక్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
అరుదైన కోతి జాతికి చెందిన జీవాలతో పాటు ఉష్ణమండల పక్షులు, గబ్బిలాలతో సహా 30 కి పైగా జంతువులు చనిపోయినట్లు జర్మన్ మీడియా తెలిపింది. ఈ సంఘటనలో అంతరించిపోతున్న అత్యంత అరుదైన జాతికి చెందిన 48 ఏళ్ళ మాసా.. అనే సిల్వర్‌బ్యాక్ గొరిల్లా మంటల్లో చిక్కుకొని మరణించడంపై జూ అధికారులు విచారం వ్యక్తం చేశారు.
చైనా స్కై లాంతర్ల వల్ల మంటలు చేలరేగి ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైనట్లు జర్మన్ పోలీసులు బుధవారం మీడియాకు తెలిపారు. జర్మన్ అన్ని రాష్ట్రాల్లో చైనీస్ స్కై లాంతర్ల అమ్మకంపై నిషేదం ఉన్నప్పటికీ నూతన సంవత్సరం వేడుకలలో చాలా చోట్ల వాటి వినియోగించడంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.