విభిన్న ఆకారాల్లో పండ్లు కోస్తూ వ్యాపారి అత్యుత్సాహం.. వీడియో వైరల్..!

Published : Jul 05, 2022, 09:51 AM IST
 విభిన్న ఆకారాల్లో పండ్లు కోస్తూ వ్యాపారి అత్యుత్సాహం.. వీడియో వైరల్..!

సారాంశం

జనాలు.. తనను గుర్తించాలని సదరు వ్యాపారి గట్టిగట్టిగా అరుస్తుండటం ఇక్కడ గమనార్హం. ఆ సమయంలోనూ విభిన్న  హావభావాలు ప్రదర్శించడం ఇక్కడ హైలెట్ గా మారడం విశేషం.

పండ్ల వ్యాపారి ఏం చేస్తాడు..? ఇదేం ప్రశ్న..? వ్యాపారి పండ్లు అమ్ముతాడు. ఎవరైనా వ్యాపారి రోడ్డు పక్కనో లేదంటే మార్కెట్లోనే ఓ బండి పై రకరకాల పండ్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ వ్యాపారి కూడా అంతే కానీ.. చాలా డిఫరెంట్ గా.. జనాలను ఆకట్టుకునేలా పండ్లు అమ్ముతున్నాడు. పండ్లను విభిన్న ఆకారాల్లో.. చూడగానే ఆకట్టుకునేలా కట్ చేస్తూ.. చేతులపై పండ్లను ఆడిస్తూ సందడి చేస్తున్నాడు. అలా చేసే సమయంలో అతను అమితానందంతో.. అత్యుత్సాహాన్ని చూపించడం గమనార్హం.

జనాలు.. తనను గుర్తించాలని సదరు వ్యాపారి గట్టిగట్టిగా అరుస్తుండటం ఇక్కడ గమనార్హం. ఆ సమయంలోనూ విభిన్న  హావభావాలు ప్రదర్శించడం ఇక్కడ హైలెట్ గా మారడం విశేషం. తన బండి వద్దకు వచ్చిన ప్రతి కష్టమర్ అతను పండ్లు కట్ చేస్తున్న విధానానికి ఇంప్రెస్ అయిపోతున్నారు.  ముఖ్యంగా పుచ్చకాయ, బొప్పాయి పండ్లను విభిన్న ఆకృతిలో కట్ చేయడం విశేషం.

ఇతను చేస్తున్న సందడిని కొందరు ఔత్సాహికులు... తమ కెమేరాల్లో బంధించారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని ఆదివారం సోషల్ మీడియాలో  పోస్టు చేయగా... వేలల్లో లైకుల వర్షం కురుస్తోంది. 

 

అతను పండ్లు కట్ చేసిన విధానం కంటే కూడా.. అతని ముఖ కవలికలు అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అతని ముఖ కవలికలు చూసి.. అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు.  ఇంత వెరైటీగా పండ్లు అమ్మడం మరెవరూ చేయరేమో. కావాలంటే మీరు కూడా చూసేయండి.

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్