Viral: నెటిజన్ల మనసు దోచేస్తున్న క్యూట్ లవ్ స్టోరీ..!

By telugu news team  |  First Published Jul 4, 2022, 9:53 AM IST

ఇటీవల ఓ వరుడు.. పెళ్లి తంతు ముగియగానే... ప్రేమగా తన భార్య పాదాలను తాకాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. తాజాగా.. ఓ మీడియా సంస్థ వారి ప్రేమ పెళ్లి కథ తెలుసుకునే ప్రయత్నం చేసింది.


పెళ్లి అనగానే..చాలా సంప్రదాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఆచారం ప్రకారం వివాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు అన్ని పెళ్లిళ్లలోనూ.. వధువు.. పెళ్లి తర్వాత తమ భర్త పాదాలను తాకుతుంది. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఇటీవల ఓ వరుడు.. పెళ్లి తంతు ముగియగానే... ప్రేమగా తన భార్య పాదాలను తాకాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. తాజాగా.. ఓ మీడియా సంస్థ వారి ప్రేమ పెళ్లి కథ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వారి క్యూట్ లవ్ స్టోరీ కూడా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి వారి లవ్ స్టోరీ ఏంటో..? వారు ఎలా కలిశారు..? ఎలా ప్రేమలో పడ్డారో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం..

ఎప్పుడైనా.. ప్రేమ కథలు ఆసక్తికరంగానే ఉంటాయి. కొందరు చదువుకునే కాలేజీలో పరిచయం ఏర్పడుతుంది. మరి కొందరికి  ఉద్యోగం చేసే దగ్గర.. ఇలా డిఫరెంట్ గా వారి ప్రేమ కథలు మొదలౌతూ ఉంటాయి. మరి ఈ క్యూట్ కపుల్  దితి, అర్నవ్ ల పరిచయం ఎలా ఎర్పడిందో తెలుసా..?

Latest Videos

undefined

 

వీరి పరిచయం సమయంలో .. దితి నిత్యం చదువుతూ.. కేవలం చదువు మీద ద్యాసతో మాత్రమే ఉండేదట. కానీ.. ఆ సమయంలో అర్నవ్ మాత్రం చాలా భిన్నంగా.. పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ సరదాగా గడిపేవాడట. అయినప్పటికీ వారి ఇద్దరి మధ్య వైబ్ బాగా సెట్ అయ్యిందని దితి చెప్పడం విశేషం.

వీరిద్దరికీ ఊహించని రీతిలో పరిచయం ఏర్పడిందట. ఒక చోట కూర్చున్న దితి దగ్గరకు అర్నవ్ వచ్చి.. కాఫీకి పిలిచాడట. ఆ కాఫీకి వెళ్లడానికి వారిద్దరూ రాక్, పేపర్, సిజర్ గేమ్ ఆడారట. ఈ గేమ్ లో మూడు సార్లు అర్నవ్ ఓడిపోవడంతో దితి కాఫీకి వెళ్లలేదట. అయితే.. ఆ సమయంలో వారు ఫోన్ నెంబర్ లు మాత్రం మార్చుకున్నారట. మరుసటి రోజే.. అర్నవ్.. ఆమెకు ఫోన్ చేసి కలవమని అడిగాడట. వారిద్దరూ.. అతని ఇంట్లోనే రెండోసారి కలుసుకోవడం విశేషం. దాదాపు వాళ్ల ఇంటి లాబీలో మూడు గంటలపాటు కూర్చొని మాట్లాడుకున్నారట. అలా తమ పరిచయం జరిగిందని దితి చెప్పింది.

అలా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత... వీరు ఇటీవల ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో.. పెళ్లి తంతు ముగిసిన తర్వాత.. అర్నవ్.. చాలా ప్రేమగా దితి పాదాలను తాకాడు. అతను చేసిన పనికి దితి కూడా ఒకింత షాకైంది.. ఆ తర్వాత ఆనందంతో.. అతనిని హత్తుకుంది. ఆ వీడియోనే ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. 

వరుడు ఆమె పాదాలను తాకిన తర్వాత.. వారి పెళ్లి చేసిన పంతులు గారు.. నీ అంత అదృష్టంవతురాలు మరొకరు లేరు అంటూ దితితో చెప్పారట. ఈ విషయాన్ని కూడా ఆమె తాను షేర్ చేసిన వీడియోతో పాటు పంచుకోవడం విశేషం. వీరి వీడియోకి లక్షల్లో లైకులు.. వేల కొద్ది కామెంట్లు రావడం గమనార్హం.
 

click me!