అయితే.. ఒక మగపాము, మరోకటి ఆడపాము అని.. అవి రెండు కలయికలో పాల్గొంటున్నాయని.. ఇలాంటివి తాము చాలనే చూశామంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం.
పాము పేరు చెబితేనే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. అలాంటిది రెండు పెద్ద పెద్ద పాములు.. ఒక్కోటి ఆరు అడుగులకు తక్కువ లేదు. అలాంటి పాములు రెండు కొట్టుకుంటే ఎలా ఉంటుంది. చూసే ధైర్యం ఉందా..? ప్రస్తుతం ఈ రెండు పాముల కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
.‘‘ఆధిపత్యం కోసం ర్యాట్ స్నేక్‌ల మధ్య యుద్ధం. రెండు మగ పాములు.. తమ ఉనికిని చాటుకునేందుకు, తమ తోడును రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం’’ అంటూ అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
undefined
అయితే.. ఒక మగపాము, మరోకటి ఆడపాము అని.. అవి రెండు కలయికలో పాల్గొంటున్నాయని.. ఇలాంటివి తాము చాలనే చూశామంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం. అయితే.. ఇవి మగ పాములు అని, అవి డ్యాన్స్ చేయడం లేదని సదరు అటవీ అధికారి స్పష్టం చేశారు. కాగా ర్యాట్ స్నేక్‌లు విష రహితమైనవి. సాధారణంగా అవి రోడెంట్స్(ఎలుకలు)ను వేటాడి ఆహారం సంపాదించుకుంటాయి. మీకు కూడా రెండు పాముల కొట్లాట చూసే ధైర్యం ఉంటే.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Rat snakes combat for dominance.
Two male fighting to define their territory & defend their mate. pic.twitter.com/FVn2FIXHte