మాస్క్ ధరించలేదని మేకను అరెస్టు చేసిన పోలీసులు

By telugu teamFirst Published Jul 27, 2020, 7:05 PM IST
Highlights

మాస్క్ ధరించలేదని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పోలీసులు ఓ మేకను అరెస్టు చేశారు మేకను జీపులో ఎక్కించుకుని పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లారు ఆ విషయం తెలిసి యజమాని పోలీసు స్టేషన్ కు పరుగులు పెట్టాడు.

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. బికోన్ గంజ్ ప్రాంతంలో తిరుగుతున్న ఓ మేకను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. మాస్క్ ధరించలేదనే ఆరోపణతో వారు ఆ పనిచేశారు.

వారాంతంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. బెకోన్ గంజ్ లో మేకను అదుపులోకి తీసుకుని జీపులో పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. తన మేకను పోలీసులు తీసుకుని వెళ్లారని తెలిసి దాని యజమాని స్టేషన్ కు పరుగులు పెట్టాడు. 

మేకను పట్టుకుని ఓ యువకుడు మాస్క్ లేకుండా వెళ్తున్నాడని పోలీసులు గుర్తించారని అన్వర్ గంజ్ పోలీసు స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ సైఫుద్దీన్ బేగ్ చెప్పారు. పోలీసులను చూసి మేకను వదిలేసి యువకుడు పరుగులు పెట్టి, పారిపోయాడని చెప్పారు 

దాంతో మేకను పోలీసు స్టేషన్ కు తెచ్చినట్లు తెలిపారు. తర్వాత మేకను యజమానికి అప్పగించినట్లు చెప్పారు. అయితే, లాక్ డౌన్ వేళ మాస్క్ లేకుండా మేక తిరుగుతున్నట్లు గమనించామని ఓ పోలీసు చెప్పడం గమనార్హం. మనుషులు మాస్క్ లు ధరిస్తున్నప్పుడు మేకకు ఎందుకు మాస్క్ లు పెట్టకూడదని ప్రశ్నించాడు. సోషల్ మీడియోలో జోకులు పేలడం ఆ పోలీసు తన మాటలను మార్చేశాడు.

click me!