రెండుసార్లు మరణం అంచులదాకా వెళ్లి..బయటపడ్డ చిన్నారి.. వైరల్ వీడియో

Published : Mar 26, 2022, 09:47 AM IST
రెండుసార్లు మరణం అంచులదాకా వెళ్లి..బయటపడ్డ చిన్నారి.. వైరల్ వీడియో

సారాంశం

ఓ తొమ్మిదేళ్ల పిల్లవాడు అతి వేగంగా సైకిల్‌ తొక్కుకుంటూ మెయిన్‌ రోడ్డు మీదకు వచ్చేశాడు. స్పీడ్‌గా వచ్చి అదుపు తప్పి కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టాడు.

ఓ చిన్నారి.. రెండు సార్లు మరణం చివరి అంచుదాకా వెళ్లి బతికి బయట పడ్డాడు. సైకిల్ తొక్కుకుంటూ వెళుతూ బస్సు కింద పడిపోయాడు.  ఈ సమయంలో సైకిల్ నుజ్జు నుజ్జు కాగా.. బాలుడు ప్రాణాలతో బయటపడటం విశేషం. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలో  ఓ తొమ్మిదేళ్ల పిల్లవాడు అతి వేగంగా సైకిల్‌ తొక్కుకుంటూ మెయిన్‌ రోడ్డు మీదకు వచ్చేశాడు. స్పీడ్‌గా వచ్చి అదుపు తప్పి కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టాడు. దాంతో ఒక ఉదుటన ఎగిరి పడి రోడ్డుకు అవతల పడ్డాడు. సైకిల్ మాత్రం రోడ్డున మీద పడిపోయింది.

 

అయితే ఆ వెనుకే అంతే వేగంగా వచ్చిన బస్సు రోడ్డు మీద పడిపోయిన సైకిల్ పైకి ఎక్కేసింది. అంటే చిన్నారి కొద్దిలో బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకోగలిగాడు. ఇంత పెద్ద ప్రమాదంలో పసివాడు చిన్న గాయం కూడా అవ్వలేదు. అసలు ఆ పిల్లగాడు క్షణాల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని ఓ సీసీటీవీ రికార్డు అయ్యింది. దీంతో వీడియో కాస్త వైరల్ గా మారింది.   ఈ వీడియో చూసిన వారందరి గుండె ఒక్కసారిగా జారిపోయింది. పిల్లాడికి ఏమీ కాకపోవడంతో..  హమ్మయ్యా అని అనుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్