స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుము..వైరల్ వీడియో

By telugu teamFirst Published Oct 21, 2019, 11:19 AM IST
Highlights

ప్రాజెక్ట్ స్త్రీధన్ పేరుతో ఓ సంస్థ ఇటీవల ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవితం గురించి పనిచేసే డీఎస్ఎమ్ అనే సంస్థ ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా ధన త్రయోదశికి బంగారు ఆభరణాల దుకాణాలు విడుదలచేసే కమర్షియల్ ప్రకటనల కన్నా భిన్నంగా ఈ వీడియోని విడుదల చేసింది.

స్త్రీలకు బంగారం అంటే అమితమైన ప్రీతి ఉంటుంది. ఈ విషయంలో ప్రపంచంలో అందరికీ తెలుసు. ముఖ్యంగా అక్షయ తృతియ, ధన త్రయోదశి లాంటి రోజుల్లో కచ్చితంగా బంగారం కొనాలని వారు కోరుకుంటారు. మరో నాలుగు రోజుల్లో ధనత్రయోదశి రానుంది. ఆ రోజు కూడా అందరూ బంగారం కొనుగోలు  చేస్తారు. అయితే... ఈ సంవత్సరం మహిళలకు ఈ ధన త్రయోదశి రోజు కావాల్సింది బంగారం కాదు... ఇనుము అంటోంది ఓ సంస్థ.

సాధారణంగా మన దేశంలో బంగారానికి విలువ ఎక్కువ ఇస్తారు. ఇనుముకి అసలు ఎలాంటి విలువ ఇవ్వరు. అలాంటిది.. బంగారం కాకుండా... ఇనుము అవసరం రావడమేమిటా అనే అనుమానం మీకు కలిగి ఉండొచ్చు. కానీ... ఆ సంస్థ చెబుతున్నది నిజం. నిజానికి స్త్రీ కి కావాల్సింది బంగారం కాదు.. ఇనుము. 

ఇంతకీ మ్యాటరేంటంటే...  ప్రాజెక్ట్ స్త్రీధన్ పేరుతో ఓ సంస్థ ఇటీవల ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవితం గురించి పనిచేసే డీఎస్ఎమ్ అనే సంస్థ ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా ధన త్రయోదశికి బంగారు ఆభరణాల దుకాణాలు విడుదలచేసే కమర్షియల్ ప్రకటనల కన్నా భిన్నంగా ఈ వీడియోని విడుదల చేసింది.

ఐరన్ లోపంతో మనదేశంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఐరన్ పుష్కలంగా లభించే ఆహారాలు ఇవి అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. బంగారం కన్నా కూడా ఐరన్ వారికి ఎంతో ఎక్కవ ఉపయోగపడుతుందనే అర్థం వచ్చేలా వీడియోని తయారు చేయడం విశేషం. 

ఓ వీడియోలో.. ఒండి నిండా ఆభరణాలు ధరించి ఉన్న ఓ యువతిని చూపిస్తూ... అదే ఐరన్ అయితే.. మీ శరరంలో నరనరాల్లో ప్రవహిస్తుందని వారు పేర్కొన్నారు. స్త్రీలకు ఐరన్ ఎంత అవసరమో తెలియజేస్తూ... జనాలకు చైతన్య పరుస్తున్నారు. ఈ వీడియోని మూడు రోజుల క్రితం యూట్యూబ్ లో పోస్టు  చేయగా... మిలియన్ల మంది వీక్షించారు. 

2018 జనవరిలో నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ –4) విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో దాదాపు యాభై మూడు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడ్తున్నారు. కాబట్టి ఈ ధన్‌తేరస్‌నే ఆరోగ్య సంరక్షణకు శుభారంభంగా భావించి ప్రతిరోజు ఆహారంలో విధిగా ఐరన్‌ ఉండేలా చూసుకోండి. స్త్రీ ఆరోగ్యమే దేశానికి మహాభాగ్యం


 

click me!