పాము కనిపిస్తే చాలు..పిజ్జాలా కొరికేస్తాడు.. కూల్ డ్రింక్‌లా విషాన్ని తాగేస్తాడు

Published : Oct 12, 2019, 05:18 PM ISTUpdated : Oct 12, 2019, 05:24 PM IST
పాము కనిపిస్తే చాలు..పిజ్జాలా  కొరికేస్తాడు.. కూల్ డ్రింక్‌లా విషాన్ని తాగేస్తాడు

సారాంశం

ప్రకాశం జిల్లా కొండెపి చెందిన  వెంకటేశ్వర్లు.నేతివారిపాలెం గ్రామానికి చెందిన ఇతను పాము కనిపిస్తే చాలు దాని పట్టుకుని కరకర నమిలి పారేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇతని సాహసం పాములతోనే.. సాధారణంగా పాములు  మనుషులను భయపడేతాయి కానీ ఇతను మాత్రం పాములను భయపేడుతాడు. అతను చిక్కమో చచ్చాంరా అనేంతలా వాటికి నరకాన్ని చూపిస్తాడు.  

పామును చూస్తేనే చాలు చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు. అలాంటిది  ఓ వ్యక్తి మాత్రం అవి కనిపిస్తే చాలు పండుగ చేసుకుంటాడు. అతనికి అది ఓ ఆట వస్తువుల
కనిసిస్తోంది. పామును పట్టుకుని  దాని విషాన్ని కూల్ డ్రింక్‌లా తాగేస్తాడు. శరీరాన్ని పిజ్జాలా కొరికేస్తాడు. ఇంతకి ఆ వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా కొండెపి చెందిన  వెంకటేశ్వర్లు.

నేతివారిపాలెం గ్రామానికి చెందిన ఇతను పాము కనిపిస్తే చాలు దాని పట్టుకుని కరకర నమిలి పారేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇతని సాహసం పాములతోనే.. సాధారణంగా పాములు  
మనుషులను భయపడేతాయి కానీ ఇతను మాత్రం పాములను భయపేడుతాడు. అతను చిక్కమో చచ్చాంరా అనేంతలా వాటికి నరకాన్ని చూపిస్తాడు.

వెంకటేశ్వర్లు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటాడు. చూట్టూ పక్కల గ్రామాలలో ఉన్నవారి ఇళ్లలోకి పాములు వస్తే వెంటనే ఆయన్ని సంప్రదిస్తుంటారు. ఎలాంటి 
సర్ఫమైన సరే సులభంగా పట్టేసి దాంతో ఆటలు ఆడేస్తాడు. అంతటితో అగకుండా దాని తలలో నుంచి విషాన్ని కక్కించి తాగేస్తాడు.

నాలుకను పాము తలలో దూర్చి ఓ ఆట ఆడేస్తాడు. అతనికి చిన్నప్పటి నుంచి పాము విషం సేవించడం ఓ అలవాటుగా మారిపోయింది. విషాన్ని తాగినప్పటికీ అతనికి మాత్రం ఎలాంటి ప్రాణ హాని కలగదు.  

చిన్నప్పటి నుంచి పాముల విషం తాగుతుండడంతో అతని శరీరం కూడా విషతుల్యం అయిపోయింది. అతను ఏదైనా జంతువును నోటితో కరిచిన వాటి ప్రాణానికి కూడా ముప్పే. ఆయన ఒళ్ళు విషమయమని తెలిసిన కూడా అతనితో స్నేహితులు, గ్రామస్థులు స్నేహంగానే మెలుగుతారు.

అతను కూడా వారితో కలుపుగోలుగా ఉంటూ సాధారణ వ్యక్తిలానే జీవిస్తుంటాడు. అతను ఓ ముద్దుపేరు కూడా ఉంది. ఆ ఊరి వారు అతన్ని ముద్దుగా పున్నమి నాగు అని పిలుచుకుంటారు.

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్