ఆ దొంగకు దెబ్బకు వెన్నులో వణుకుపుట్టింది. జీవితంలో ఇంకోసారి దొంగతనం జోలికి వెళ్లకుండా గుణపాఠం అయ్యింది. ఈ వైరల్ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.
బీహార్ : బీహార్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్పీడ్ గా వెడుతున్న రైలు కిటికీకి బయటివైపు వేలాడుతున్న ఓ యువకుడిని వీడియో అది. ఇంతకీ అతనెవరు? ఎందుకలా వేలాడుతున్నాడు? ఎవరూ రక్షించలేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లాలి..
బీహార్ లోని బెగుసరాయ్‌లో స్పీడ్‌గా వెళ్తున్న రైలు కిటికీ వెలుపల వేలాడుతున్న ఆ వ్యక్తి ఓ దొంగ . అతను భయంతో సహాయం కోసం ఏడుస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.
undefined
షాకింగ్: ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
అతను కదులుతున్న రైలులో కిటికీలోంచి చేతులు పెట్టి దొంగతనం చేశాడు. ఆ తరువాత పారిపోతుండగా.. ప్రయాణికులు అతని చేతులను గట్టిగా పట్టుకున్నారు. రైలు వేగం అందుకోవడంతో దొంగ పారిపోలేక అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. దొంగను ప్రయాణికులు పట్టుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. వీడియోలో దొంగ ఏడుస్తూ సహాయం కోరడం చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ దొంగ తన ప్రాణాలను పణంగా పెట్టి వేగంగా వెళ్తున్న రైలు కిటికీకి గ్రిల్ పట్టుకుని కిలోమీటర్ల మేర అలాగే ప్రయాణించాడు. సోన్‌పూర్ బరౌనీ రైల్వే బ్లాక్‌లోని బచ్వాడా జంక్షన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. జనాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన దొంగను లోపలినుంచి ప్రయాణికులు పట్టుకోవడంతో.. పారిపోలేక కిటికీ గ్రిల్స్‌కు వేలాడాడు.
కదులుతున్న రైలు నుంచి దూకి తప్పించుకోకుండా ఉండేందుకు దొంగ చేతులను కూడా పట్టుకున్నారు. రైలు బచ్వాడ జంక్షన్‌కు చేరుకునే వరకు ప్రయాణికులు అతడిని అలాగే పట్టుకున్నారు. ఆ తరువాత స్టేషన్ కు చేరుకున్నాక ప్రయాణికులు అతడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కి అప్పగించారు.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులు ఓ దొంగను రైలులో పట్టుకుని కదులుతున్న రైలు కిటికీ గ్రిల్స్‌కు కట్టేశారు. సాహెబహ్‌పూర్ కమల్ నుంచి ఖగారియా వైపు వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు దొంగను కిటికీకి వేలాడదీయగా, ఇక్కడే దొంగ కిటికీకి ఉరివేసుకుని చనిపోయాడు.
ఇప్పటి ఈ ఘటనలో దొంగ తనంతట తానుగా రైలు కిటికీకి వేలాడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తప్పుడు చర్య వల్ల అతనే తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. అతివేగంతో వెళుతున్న రైలు బయట వేలాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి దొంగను రైలులోకి ప్రవేశించేందుకు ప్రయాణికులు అనుమతించి ఉండాల్సిందని కొందరు నెటిజన్లు అంటున్నారు.
దొంగ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసే బదులు అతన్ని రైలు లోపలికి లాగి పోలీసులకు అప్పగించి ఉండాల్సిందని.. వేగంగా వెళ్తున్న రైలు నుంచి కింద పడి చనిపోయి ఉండేవాడని మరికొందరు అంటున్నారు. ఇంకొందరేమో... ఇక జీవితంలో దొంగతనం అంటే నిద్రలో కూడా దడుచుకుంటాడు బిడ్డ.. అంటూ కామెంట్ చేశారు.
में चलती ट्रेन से लटका चोर
सोनपुर बरौनी रेलखंड के बछवाड़ा जंक्शन के समीप एक युवक को चोरी के शक में लोगों से बचने के लिए किमी तक ट्रेन की खिड़की से लटका रहा । इसके बाद बछवाड़ा जंक्शन पहुचने पर वहां लोगों ने उतारकर उसे आरपीएफ के हवाले कर दिया। pic.twitter.com/aFgkWQktsQ