నిజంగానే వారి పెంపుడు కుక్క వాళ్లను కాపాడేసింది. ఇప్పుడు ఆ కుక్క సోషల్ మీడియాలో బాగా ఫేమస్ కూడా అయిపోయింది. శెభాష్ అంటూ దానిని మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఆ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. జలుబు చేస్తే చాలు కరోనా వైరస్ అని భయపడే పరిస్థితి వచ్చింది. నిన్న, మొన్నటి వరకు భయపెట్టిన స్వైన్ ఫ్లూ కాస్త తగ్గుముఖం పట్టగానే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.
గత కొంతకాలంగా చైనాను భయపెడుతున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ సోకి 80 మంది ప్రాణాలు కోల్పోగా.. 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్ ప్రకటించింది.
undefined
Also Readకరోనా వైరస్ కి మందు.. మా దగ్గర ఉందంటున్న తమిళనాడు డాక్టర్.
కాగా.. ఈ వైరస్ నుంచి ఓ కుటుంబాన్ని వారి పెంపుడు కుక్క కాపాడింది. అదేంటి..? అసలు ఈ కరోనా వైరస్ కి మందే లేదని అందరూ చెబుతుంటే కుక్క ఎలా కాపాడింది..? ఇదే కదా మీ డౌట్. కానీ నిజంగానే వారి పెంపుడు కుక్క వాళ్లను కాపాడేసింది. ఇప్పుడు ఆ కుక్క సోషల్ మీడియాలో బాగా ఫేమస్ కూడా అయిపోయింది. శెభాష్ అంటూ దానిని మెచ్చుకుంటున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే... తైవాన్ కి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి చైనాలోని వుహాన్( మొదట కరోనా వైరస్ వ్యాప్తిచెందింది ఇక్కడి నుంచే) వెళ్లాలని అనుకుంది. అందుకు తగన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రీవర్ కిమి అనే కుక్క ఆమె పాస్‌పోర్ట్ చింపి పడేసింది. దీంతో ఉహాన్ నగరానికి వెళ్లే ఆమె ప్రయాణం కాన్సిల్ అయ్యింది. దీంతో ఆమెకు కోపం వచ్చింది. కానీ ఏమీచేయలేక వదిలేసింది.
కుక్క తినేసిన పాస్ పోర్టు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి తన అనుభవాన్ని తెలియజేసింది..“నా పాస్‌పోర్ట్ చిరిగినట్లు చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కొన్ని రోజుల తరువాత వుహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తెలుసుకున్నాను. నా కుక్క నాతో పాటు నా కుటుంబాన్ని.. నాదేశాన్ని కూడా కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించింది అని సంతోషంగా తెలిపింది. ’’ కాగా కుక్క, చినిగిన పాస్ పోర్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.