ప్లేట్ మ్యాగీ ధర రూ.400..! ఎక్కడో, ఎందుకో తెలుసా.....(వీడియో)

Published : Jun 15, 2023, 10:58 AM IST
ప్లేట్ మ్యాగీ ధర రూ.400..! ఎక్కడో, ఎందుకో తెలుసా.....(వీడియో)

సారాంశం

మ్యాగీ ప్యాకెట్ ఎంతుంటుంది.. రూ.20 అంతేకదా..మరి రెడీగా చేసిచ్చే మ్యాగీ అయితే.. ప్లేట్ ఓ రూ.30 రూ. ఉండొచ్చు.. కానీ ఏకంగా రూ. 400కు ప్లేట్ అమ్ముతున్నాడో వ్యాపారి. 

ఢిల్లీ : ఢిల్లీలో ఓ వ్యాపారి రెండు నిమిషాల వంటకం మ్యాగీని రూ.400కు ప్లేట్ చొప్పున అమ్ముతున్నాడు. అదేంటీ.. బంగారపు పూతపూస్తున్నాడా? లేకపోతే.. దీంతో అత్యంత ఖరీధైన ఇంగ్రీడియంట్స్ కలిపాడా? ఫైవ్ స్టార్ కంటే ఖరీదైన హోటల్ లో అమ్ముతున్నాడా? అంత రేటెందుకు అని ఆశ్యర్యపోతున్నారా? మీరనుకునేవేవీ కాదు.. అయినా కూడా అతని మ్యాగీకి ఫుల్ డిమాండ్ ఉందట...

వార్నీ.. అని ముక్కున వేలేసుకోకండి అసలు దీని కథాకమామీషు ఏంటో ఓ సారి చూడండి.. హాస్టల్ లో ఉండే వారికి.. ఎగ్జామ్స్ కు నైట్అవుట్ చేసేవారికి.. రాత్రిపూట ఆదుకునే  వంటకం మ్యాగీ. అందులో కూరగాయముక్కలు వేసి చేసుకోవడం ఓకే.. కానీ ఇటీవల చాలామంది..మ్యాగీతో రకరకాల ఫ్యూజన్ వంటకాలు చేస్తూ.. మ్యాగీ లవర్స్ కోపానికి గురవుతున్నారు. 

అలాంటిదేనా ఈ మ్యాగీ? అని అనుమానం వస్తుంది కదా.. అదేం కాదు... కాకపోతే దీని పేరు ‘బక్రే కి నక్రే’. అర్థం అయ్యింది కదా.. మటన్ మ్యాగీ అన్నమాట.. దీనికి సంబంధించిన వీడియో ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో బంటీ మీట్ వాలా అనే స్ట్రీట్ వెండర్ కనిపిస్తాడు. అతను ఆ ఖరీదైన మ్యాగీని ఎలా తయారు చేస్తున్నాడో చూపిస్తాడు. మటన్ కర్రీతో నిండిన వోక్‌లో మ్యాగీని తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని ప్రత్యేకమైన మసాలాలు, కూరగాయలను చల్లిన తర్వాత, అతను మ్యాగీలో పెద్ద మటన్ ముక్కను జోడించాడు. 'బఖ్రే కే నఖ్రే' అని పిలవబడే ఈ వీడియో చూస్తే మీరూ తినడానికి ఉవ్విళ్లూరతారు.

ఈ పోస్ట్‌కి 3.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం మాగీని మ్యాగీలా మాత్రమే ఇష్టపడే వారు.. ఇలా చేయడాన్ని చికాకు పడ్డారు. అయితే డిష్‌ని ప్రయత్నించాలని కూడా కొంతమంది అన్నారు. వంటలో మటన్ బాగానే వేశాడు కాబట్టి ధర కూడా ఓకే అని కొందరు అభిప్రాయపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్