ఫుడ్ ఆర్డర్ కోసం 3 కి.మీ నడిచిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్.. అతని కథకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నెటిజన్లు.. వైరల్

By SumaBala Bukka  |  First Published Jun 14, 2023, 11:38 AM IST

లింక్డ్‌ఇన్ వినియోగదారు ఒకరు స్విగ్గీ డెలివరీ ఏజెంట్ హృదయ విదారక కథనాన్ని షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. 


సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులో కూర్చుని, వేలకు వేలు జీతాలు తీసుకుంటూ కూడా.. చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తితో ఉండేవారు చాలామంది కనిపిస్తారు. దీనికి వందకారణాలు ఉండొచ్చు. కానీ చేయడానికి చిరు ఉద్యోగం లేకుండా కష్టపడే వేలాది నిరుద్యోగుల గురించి ఒక్కసారి ఆలోచిస్తే మీ ఉద్యోగంలో మీరు సంతృప్తిగా ఉండగలుగుతారు. 

అలాంటి హృదయాల్ని కదిలించే కథే ఇది. ఓ 30 ఏళ్ల వ్యక్తి కథ వింటే.. మీకు లభించిన దానికి మీరు ఎంతో సంతోషిస్తారు. టెక్ కంపెనీ ఫ్లాష్‌లో మార్కెటింగ్ మేనేజర్ ప్రియాంషి చందేల్ ఈ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ను డెలివరీ చేయడానికి ఓ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ 3 కిమీ నడిచి ఆమెకు డెలివరీ అందించాడు. 

Latest Videos

undefined

అతనితో జరిగిన సంభాషణ ఆమె ఇలా పంచుకుంది. అతను అప్పుల్లో ఉన్నందున అతనికి బండి లేదు. అందుకే నడిచే అతను ఫుడ్ డెలివరీ చేయగలుగుతారు. ప్రియాంషి లింక్డ్‌ఇన్‌ లో ఈ కథను షేర్ చేసింది. సాహిల్ సింగ్‌గా చెబుతున్న ఆ యువకుడు ఈసీఈ గ్రాడ్యుయేట్. కరోనా మహమ్మారి సమయంలో జమ్మూలోని తన ఇంటికి వెళ్లే ముందువరకు నింజాకార్ట్, బైజూలలో పని చేసేవాడు. అతను తన హృదయ విదారక దుస్థితిని ప్రియాన్షితో పంచుకున్నాడు.

 

మూడు కి.మీ.లు నడిచిన తరువాత అతను కొంచెం నీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆ తరువాత తన కథను చెప్పాడు. ఆమె అతనికి నీళ్లతో పాటు, రూ. 500 ఇచ్చారు. అతనికి చాలా అవసరం ఉన్నందున అతనికి తగిన ఉద్యోగం కోసం ఆమె లింక్డ్‌ఇన్‌లో మొత్తం ఎపిసోడ్‌ను పంచుకుంది.

3 కిలోమీటర్లు నడిచిన తర్వాత సాహిల్ ప్రియాంషి ఇంటి  ఫ్లాట్ వెలుపల మెట్ల మీద కూర్చున్నాడు. “మేడమ్, నాకు ప్రయాణించడానికి ఎలాంటి వాహనం లేదు, నేను మీ ఆర్డర్‌తో 3 కిమీ నడిచాను. నా దగ్గర పూర్తిగా డబ్బు లేదు, నా ఫ్లాట్‌మేట్ నేను ‘యులు’కు కట్టడానికి దాచుకున్న డబ్బును తీసుకొని నన్నుఇంకా రూ.235ల అప్పులో పెట్టాడు. నా యజమానికి చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేదు. 

ఇదంతా మిమ్మల్ని మోసం చేయడానికి చెబుతున్నానని అనుకోవచ్చు. నేను చదువుకున్న ఈసీఈ గ్రాడ్‌ని, కోవిడ్ సమయంలో జమ్మూ ఇంటికి వెళ్లే ముందు బైజస్‌లోని నింజాకార్ట్‌లో పని చేసేవాడిని. ఈ ఆర్డర్ డెలివరీకి కూడా నాకు 20-25 రూపాయలు మాత్రమే లభిస్తాయి. నేను 12 లోపు మరొక డెలివరీ తీసుకోవాలి, లేదంటే వారు నన్ను ఎక్కడికైనా దూరంగా డెలివరీ కోసం పంపుతారు. 

నా దగ్గర బైక్ లేదు. నేను ఒక వారం రోజుల నుంచి తినలేదు, కేవలం నీళ్ళు,  టీ త్రాగుతున్నాను. నేనేమీ అడగడం లేదు, నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పండి ప్లీజ్. నేను ఇంతకు ముందు రూ. 25వేలకు ఉద్యోగం చేశాను. నాకు 30 ఏళ్లు, నా తల్లిదండ్రులు ముసలివారు అవుతున్నారు, నేను వారి నుండి డబ్బు అడగలేను” అని ప్రియాషిని చెప్పాడు. 

అతనికి తగిన ఉద్యోగాన్ని వెతకడం కోసం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారామె. ఆమె అతని ఇమెయిల్ చిరునామా, మార్క్ షీట్‌లు, సర్టిఫికేట్లు, పత్రాల చిత్రాలను అప్‌లోడ్ చేసి, “ఎవరైనా ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ మొదలైనవాటికి ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే, దయచేసి ఇతడికి సహాయం చేయండి!” అని రాసింది.

కొంతమంది వినియోగదారులు అతని యులు బైక్‌ను రీఛార్జ్ చేయగా, మరికొందరు అతని స్థానంలో ఆహారాన్ని పంపిణీ చేశారు.తర్వాత, సాహిల్‌కి ఎట్టకేలకు ఉద్యోగం దొరికిందని  చందేల్ మరో పోస్ట్ లో తెలిపారు. 

click me!