తాగిన మత్తులో కారును అపరిచితుడికి అప్పగించిన ఓ వ్యక్తి స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది. మత్తు దిగాక లబోదిబోమంటూ అతను పోలీసులను ఆశ్రయించాడు.
ఢిల్లీ : శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. పీకలదాకా తాగిన ఓ వ్యక్తి... తన కారును వేరే ఓ వ్యక్తికి ఇచ్చి.. తాను లిప్ట్ అడిగిన వ్యక్తిలా దిగిపోయాడు. ఆ తరువాత మెట్రో ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. తాగిన మత్తు దిగిన తరువాత అసలు విషయం గుర్తుకు వచ్చి తల పట్టుకున్నాడు. తన కారు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్.. రూ.18,000 నగదును పోగొట్టుకున్నట్టు గుర్తించి.. లబోధిబో మంటూ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-IIలో నివసిస్తున్న ఓ వ్యక్తి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ ఘటన గురించి వివరించాడు. సంఘటన జరిగినప్పుడు తాను "చాలా తాగి" ఉన్నానని పోలీసులకు చెప్పాడు. ముప్పై ఏళ్ల అమిత్ ప్రకాష్ గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని ఒక సంస్థలో ఉద్యోగి. ఘటన జరిగిన ఒక రోజు తర్వాత తాను పోగుట్టుకున్నట్టు గుర్తించి.. హర్యానా నగరంలోని సెక్టార్ 65 పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
undefined
వివాహేతర సంబంధం : సెల్ఫీ తీసుకుందామంటూ తీసుకెళ్లి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పంటించిన భార్య..
ఇంతకీ ఏం జరిగిందంటే.. అమిత్ ప్రకాశ్ శుక్రవారం రాత్రి గుర్ గావ్ లోని తన ఆఫీస్ నుంచి బైటికొచ్చి కారులో మద్యం తాగాడు. అతనికది సరిపోలేదు. ఇంకాస్త తాగాలనుకుని గోల్ఫ్ కోర్సు రోడ్డు ఉన్న మందు దుకాణానికి వెళ్లి రూ. 2వేలు పెట్టి ఓ వైన్ బాటిల్ కొన్నాడు. ఆ సమయంలో అతను రెండువేలకు బదులు రూ.20వేలు ఇచ్చాడు. దీనికి ఆ షాపు ఓనర్ రూ.18వేలు తిరిగిచ్చాడు.
ఆ డబ్బులు తీసుకుని రోడ్డు పక్కన కారులో కూర్చుని మద్యం తాగుతున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి కారు దగ్గరికి వచ్చి తనకూ మందు పోయమని అడిగాడు. తనకు సుభాష్ చౌక్ దాకా లిఫ్ట్ ఇవ్వమని కోరాడు. దీనికి అమిత్ ఒప్పుకుని కారెక్కించుకున్నాడు. కాసేపటికి మద్యం మత్తులో పూర్తిగా మునిగాక అతను అమిత్ ను తన కారు దిగాలని చెప్పాడు. అమిత్ కూడా అలాగే కారు దిగి..అపరిచితుడికి కారు అప్పగించాడు.
ఆ తర్వాత అమిత్ ఇంటికి మెట్రో ఎక్కి వెళ్లిపోయాడు. తాగిన మత్తులో కారు తనదే అన్న విషయం మరిచిపోయాడు. తాగింది దిగాక కానీ విషయం బోధ పడలేదు. దీనికి సంబంధించిన న్యూస్ ట్విట్టర్ లో వైరల్ అయ్యింది. దీనిమీద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
అమిత్ ప్రకాష్ అపరిచితుడి గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేకపోయాడు, దీని కారణంగా పోలీసులు అతన్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.