Strawberry Super Moon 2022 : ఆకాశాన్ని వెలిగించిన స్ట్రాబెరీ సూపర్ మూన్.. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే..

By SumaBala Bukka  |  First Published Jun 15, 2022, 10:48 AM IST

మంగళవారం, జూన్14న ఆకాశంలో చంద్రుడు నిండు వెన్నెల కాంతులను వెదజల్లాడు. అయితే ఇది మామూలు పౌర్ణమి కాదు... చంద్రడు స్ట్రాబెరీ సూపర్ మూన్  గా కనిపించిన ప్రత్యేకమైన రోజు. 


న్యూఢిల్లీ : జూన్ 14న వచ్చిన పౌర్ణమి అద్భుతాన్ని ఆవిష్కరించింది. మంగళవారం చంద్రుడు Strawberry Super Moon రూపంలో ఆకాశాన్ని వెలిగించాడు. ఇది జూన్ 14న సాయంత్రం 5.22 PM IST సమయంలో మామూలు కంటికి కనిపించింది. ఈసారి చంద్రుడు భూమి చుట్టూ తన కక్ష్యలో అత్యంత సమీపంగా ఉన్నాడు. అందుకే చంద్రుడు "Super Moon" లాగా కనిపించాడు. మంగళవారం, చంద్రుడు భూమికి 222,238 మైళ్ల దూరంలోకి వచ్చాడు.  నాలుగు సూపర్‌మూన్‌ల క్రమంలో ఇది రెండోది.

దీనిని Strawberry Moon అని పిలుస్తున్నారు. ఈ చంద్రుడి ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఆ చంద్రుడి అందాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు. NASA ప్రకారం, ఒక సూపర్‌మూన్ దాని కక్ష్యలో భూమికి చాలా దూరంలో ఉన్నప్పుడు, సంవత్సరంలోని అత్యంత ప్రకాశవంతమైన చంద్రోదయం కంటే 17% పెద్దదిగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూపర్‌మూన్‌లు చాలా అరుదు. సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు సంభవిస్తాయి. అయితే ఇవి ప్రతీసారీ వరుసగానే కనిపిస్తాయి. 

Latest Videos

undefined

స్ట్రాబెర్రీ మూన్.. అంటే స్ట్రాబెర్రీ లాగానో, పింక్ రంగులోనో కనిపించదు. ఇది అందరికీ తెలియని విషయం. స్ట్రాబెరీ మూన్ అనగానే పింక్ రంగులో కనిపిస్తుందనుకుంటారు. లేదా స్ట్రాబెరీ షేప్ లో ఉందేమో అని ఆలోచిస్తారు.. కానీ అది వాస్తవం కాదు.. ఇంతకీ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే.. ఈశాన్య US తూర్పు కెనడాలోని అల్గోన్క్విన్ స్థానిక అమెరికన్ తెగ వారు పౌర్ణమికి ఈ పేరు పెట్టారు. ఇది ఆ ప్రాంతంలోని స్ట్రాబెర్రీ కోత కాలాన్ని సూచిస్తుంది. చంద్రుని రంగు కాదు. స్ట్రాబెర్రీ మూన్ అనే పేరును ఓజిబ్వే, అల్గోన్‌క్విన్, లకోటా, డకోటా ప్రజలు జూన్-బేరింగ్ స్ట్రాబెర్రీలు పండినందుకు గుర్తుగా ఉపయోగించారని ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ చెబుతోంది.

"వేసవి కాలంలో, సూర్యుడు సంవత్సరం మొత్తంలో అత్యధికం సమయం ఆకాశంలో కనిపిస్తాడు. నిండు చంద్రుడు సూర్యుడికి ఎదురుగా ఉంటాడు. కాబట్టి వేసవి కాలంలో ఆకాశంలో పౌర్ణమి తక్కువగా ఉంటుంది, ”అని నాసా ఒక గైడ్‌లో తెలిపింది.

ఈ సంవత్సరం మరో ఆరు పౌర్ణమిలు వస్తాయి. ఆ పౌర్ణమిల క్యాలెండర్ ఇదే.. 

జూలై 13 : బక్ మూన్

ఆగష్టు 11 : స్టర్జన్ మూన్

సెప్టెంబర్ 10 : హార్వెస్ట్ మూన్

అక్టోబర్ 9 : హంటర్స్ మూన్

నవంబర్ 8 : బీవర్ మూన్

డిసెంబర్ 7 : కోల్డ్ మూన్

స్ట్రాబెర్రీ మూన్ హిందూ పండుగ అయిన వాట్ పూర్ణిమ సమయంలో కలిసి వచ్చినట్టుగా ఉంటుంది. వాట్ పూర్ణిమ నాడు వివాహితలు మర్రి చెట్టు చుట్టూ పవిత్ర దారాన్ని కట్టి వారి జీవిత భాగస్వాముల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు.
 

Full moon in Mumbai ! Sending positive to everyone pic.twitter.com/xvoFE9K1v5

— Kevin (@iamkevins)

🌕 June 14 2022
At the end of your night, try to clear release old energies that are not serving you. This moon is for prosperity & manifesting. What are you drawing in? pic.twitter.com/QwebOwJAVv

— ॐ Tomorrow Never Knows ॐ (@CosmicDustAra)

FULL STRAWBERRY MOON 🍓🌕

LOOK: Photographers captured the spectacular appearance of tonight's full "Strawberry Supermoon," as seen from their locations on Tuesday, June 14.

📸: See each photo for proper credits | pic.twitter.com/LhjeSu0CA1

— Be An INQUIRER (@BeAnINQUIRER)
click me!