బొకే ఇచ్చాడు, పువ్వులు మరిచాడు.. మధ్యప్రదేశ్ లో ప్రియాంకగాంధీకి వింత అనుభవం... వీడియో వైరల్...

By SumaBala BukkaFirst Published Nov 7, 2023, 10:49 AM IST
Highlights

ప్రియాంకగాంధీకి చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వార్నీ నేతలు ఇలా కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. 

మధ్యప్రదేశ్ : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీకి మధ్యప్రదేశ్ లో వింత అనుభవం ఎదురయ్యింది. దీంతో అక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆమె ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. దీంతో వేదిక మీద నవ్వులు వెళ్లి విరిశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం మధ్య నవ్వులు పుశాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాకు ఒక పార్టీ నాయకుడు వేదిక మీద బొకే ఇచ్చి స్వాగతం పలికాడు. అయితే ఆ బొకేలో పువ్వులు లేవు.. అది చూసిన ప్రియాంక నవ్వు ఆపుకోలేక పువ్వులు ఏవీ అంటూ.. నవ్వేశారు. తప్పు తెలుసుకున్న ఆ నాయకుడు కూడా పొరపాటు గ్రహించి నాలుక కరుచుకున్నాడు. 

బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా తీవ్రత..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంగ్రెస్ నాయకురాలి ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఉల్లాసకరమైన ఘటన వెలుగు చూసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రంలో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది, గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా... కొద్ది రోజులకే జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ఏర్పడిన తిరుగుబాటు కారణంగా అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీతో ఉన్నారు.

ఈ ర్యాలీని కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ లింక్‌ను ప్రియాంకా గాంధీ వాద్రా ఎక్స్ లో షేర్ చేస్తూ..  "ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ భూమి, ఇది న్యాయం, సత్యం, సుపరిపాలనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు అవినీతి,చెడు పాలనను అంతం చేయడం ద్వారా ఆ విలువలను పునరుద్ధరిస్తారు" అని పోస్ట్ చేసారు.

ఈ వీడియోలో ప్రియాంకా గాంధీ వాద్రాకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆమె వద్దకు వెళ్లి అభివాదం చేస్తున్నారు. ఆమె నవ్వుతూ వారిని తిరిగి పలకరిస్తూ కనిపించారు. కొందరు నాయకులు ఆమెకు గులాబీల బొకేలు ఇచ్చారు. మరికొందరు ఆమెతో ఫోటోలు దిగారు.

ఈ సమయంలో, ఒకరు.. బొకేలాంటిది పట్టుకొచ్చాడు. దాన్ని ప్రియాంకా గాంధీకి ఇచ్చాడు. అది చూసిన ఆమె వెంటనే నవ్వడం ప్రారంభించింది. ఇందులో పువ్వులు ఎక్కడ ఉన్నాయి.. అంటూ ఖాళీ బొకేను అతనికి చూపించింది. అది చూసిన అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేసారు. కాసేపటికి ఆ నాయకుడు అక్కడినుంచి మాయమయ్యాడు. 


 

गुलदस्ता घोटाला 😜
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया। pic.twitter.com/y7Qmyldp94

— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup)
click me!