అమ్మవారి జాతరలో కపుల్స్ రొమాన్స్... ఇదెక్కడి ఆచారం..!

By telugu news teamFirst Published Feb 29, 2020, 11:31 AM IST
Highlights


పెళ్లైన దంపతులు ఇలా ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్స్  చేస్తుంటారు. ఫస్ట్ టైమ్ చూసేవాళ్లకి మాత్రం ఏంటి ఇది ఇలా పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్నారు అని అనుకోక మానరు. 

అమ్మవారి జాతర అనగానే ఎవరికైనా ఏం గుర్తుకువస్తుంది..? అయ్యగార్ల మంత్రోచ్చరణలు... పూనకం వచ్చినట్లుగా డ్యాన్స్ చేసే మహిళలు.. భాజా భజంత్రీలు.. మేకపోతులను బలివ్వడాలు ఇవే చూస్తాం. కానీ అక్కడ మాత్రం  ఒకరినొకరు తెగ ముద్దులు పెట్టుకుంటారు. అలా ముద్దులు పెట్టుకుంటూనే డ్యాన్సులు చేస్తారు. నిజానికి ఇలాంటి గుళ్లల్లో అపవిత్రంగా భావిస్తారు. కానీ అక్కడ మాత్రం అదే ఆచారమట. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read పీకల దాకా తాగి హైడ్ అండ్ సీక్: బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి కునుకు...

 బళ్లారి జిల్లాకు ఆనుకుని ఉన్న దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో ప్రతి 10 ఏళ్ల కొకమారు వచ్చే గ్రామ ఊరమ్మ దేవి జాతర ఈ విశిష్టను పొందింది. మాగానహళ్లి గ్రామం దేవత జాతరలో భక్తులు జంటలుగా డ్యాన్స్‌ చేయడం, ము ద్దులు పెట్టుకోవడం   ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం.  

పెళ్లైన దంపతులు ఇలా ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్స్  చేస్తుంటారు. ఫస్ట్ టైమ్ చూసేవాళ్లకి మాత్రం ఏంటి ఇది ఇలా పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్నారు అని అనుకోక మానరు. అయితే.. ఈ వింత సాంప్రదాయాన్ని  పాటిస్తేనే   అమ్మవారు సంతృప్తి చెందుతారని స్థానికులు చెప్పడం విశేషం.  తామంతా అమ్మవారి కృపకు పాత్రులవుతామని స్థానికుల అపార నమ్మకం.

 సాధారణంగా జాతరలో తొలుత అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు చేస్తామని,  అనంతరం అనాధిగా వస్తున్న ఈ నృత్యాన్ని చేస్తామని  వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామస్థులు ఆచార , సాంప్రదాయాలతో జాతను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

click me!