పెట్రోల్ పోయలేదని పగ... ఆరడుగుల పాము తీసుకొచ్చి ప్రతీకారం

By Siva KodatiFirst Published Jul 15, 2020, 8:44 PM IST
Highlights

పెట్రోల్ పోయలేదని కక్షగట్టిన ఓ వ్యక్తి పాము ద్వారా తన పగ తీర్చుకున్నాడు

పెట్రోల్ పోయలేదని కక్షగట్టిన ఓ వ్యక్తి పాము ద్వారా తన పగ తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని బుల్దానాకు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ బంకు దగ్గకు వెళ్లి పెట్రోల్ పోయమన్నాడు.

అయితే  అక్కడున్న సిబ్బంది తల అడ్డంగా ఊపుతూ కుదరదని పంపించివేశారు. అతను పెట్రోల్ కొట్టించేందుకు బండికి బదులు బాటిల్ పట్టుకొచ్చాడు. అయితే తనకు పెట్రోల్ ఇవ్వనందుకు అక్కడి సిబ్బందిపై కక్షగట్టాడు ఆ వ్యక్తి.

కొద్దిసేపటికి ఇంకా పెద్ద బాటిల్ తీసుకొచ్చి అందులో నుంచి పెద్ద పామును పెట్రోల్ బంకులోని గదిలో వదిలాడు. వెంటనే ఆ పాము అక్కడి బల్ల కిందకి దూరిపోయింది. ఆ సమయంలో గదిలో ఒకే ఒక మహిళ ఉంది.

దీంతో ఆమె బిక్కుబిక్కుమంటూనే నెమ్మదిగా అక్కడి నుంచి ఎలాగోలా బయటకు వచ్చేసింది. ఇదంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డైంది. అతను ఒక్క పాముతో వదల్లేదని, మరో పామును కూడా తీసుకొచ్చి గదిలో వదిలేశాడని పెట్రోల్ బంకు సిబ్బంది పేర్కొన్నారు.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు గదిలో ఉన్న మహిళను ధైర్యవంతురాలని ఆకాశానికెత్తేస్తున్నారు. అలాగే పాముతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వ్యక్తికి సిగ్గులేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 
 

click me!