ప్రేమ గుడ్డిదని అంటుంటారు పెద్దలు. ఆ మాట ఎందుకన్నారో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఓ వ్యక్తి ఏకంగా తన తల్లిని పెళ్లి చేసుకున్నాడు
ప్రేమ గుడ్డిదని అంటుంటారు పెద్దలు. ఆ మాట ఎందుకన్నారో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఓ వ్యక్తి ఏకంగా తన తల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె అతనికి జన్మనిచ్చిన తల్లి కాదు, పెంచిన తల్లి.
వివరాల్లోకి వెళితే... రష్యాలోని 35 ఏళ్ల మెరీనా బల్మషేవ సోషల్ మీడియా స్టార్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె అలెక్స్ ఆరే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
undefined
ఈ దంపతులు ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అలా సుమారు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు మొదలవ్వడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ సమయంలో విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత న్యాయస్థానం కన్నతండ్రికే అప్పగించింది. ఈ క్రమంలో ఆరే ఇరవయ్యేళ్ల కొడుకు వ్లాదిమిర్ వోయా పెంచిన తల్లితో ప్రేమలో పడ్డాడు.
ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. తమ ప్రేమను పండించుకోవాలని భావించిన వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా కోవిడ్ 19 రావడంతో పెళ్లి వాయిదా పడింది.
ఎట్టకేలకు గతవారం తల్లీకొడుకులిద్దరూ రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. దీనిని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీరి పెళ్లి ఫోటోలు, వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే ఆరేతో మాట్లాడేదే లేదని మాజీ భార్య మెరీనా, కొడుకు వ్లాదిమిర్ తేల్చి చెప్తున్నారు. ఏడేళ్ల వయసు నుంచి పెంచుతున్న కొడుకుతో పెళ్లేంటని కొందరు ఆడిపోసుకోవచ్చు, మరికొందరు సపోర్ట్ చేయవచ్చు. కానీ అది తన ఇష్టమని ఆమె చెప్పారు. కాగా ప్రస్తుతం మెరీనా గర్భవతి కావడం గమనార్హం.