వైరల్ పోస్ట్ : హెల్మెట్ పెట్టుకోమంటే.. ఇతనేం పెట్టుకున్నాడో చూడండి...

By SumaBala BukkaFirst Published Nov 14, 2023, 1:23 PM IST
Highlights

ముఖాన్ని పేపర్ బ్యాగ్ తో కప్పేసి.. అదే హెల్మెట్ లా ఫోజిచ్చాడో పిలియన్ రైడర్. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు చిత్ర విచిత్రమైన ఘటనలకు నిలయం. బెంగళూరు ఐటీ రంగానికే కాదు.. ట్రాఫిక్ కష్టాలకు కూడా పేరొందింది. ఇప్పుడు బెంగళూరుకు చెందిన మరో ఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు వార్నీ.. ఇదేం విచిత్రం.. హెల్మెట్ ఇలా కూడా పెట్టుకోవచ్చా? ట్రాఫిక్ పోలీసు మామలు అనుమతిస్తారా? అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 

ఇంతకీ ఈ ఫొటో ఏంటంటే.. ఓ వ్యక్తి బెంగళూరులో పిలియన్ రైడ్ చేస్తున్నాడు. బైక్ నడిపే వాళ్లే కాదు, వెనక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలన్న నియమం ప్రకారం.. బండిమీద వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ లాంటిది పెట్టుకున్నాడు. అదే ఓ పేపర్ బ్యాగ్. 

ఉడిపి కుటుంబం హత్య : ఆటోలో వచ్చి.. మహిళ, ఆమె ముగ్గురు కొడుకులను హతమార్చి, బైక్ పై పరార్...

పేపర్ బ్యాగ్ ను తలకు పెట్టుకుని హెల్మెట్ లా ఫీలవుతున్నాడు. అది చూసిన వాళ్లలో ఒకరు ఫొటో తీసి ఇంటర్నెట్ లో షేర్ చేశారు. ఇంకేముంది... వైరల్ అయి కూర్చుంది. ఈ పోస్ట్ మీద ఇంటర్నెట్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. "అతను ఏఐ కెమెరాలను పరీక్షిస్తున్నాడు" అని ఒకరంటే.. "అప్పులవాళ్లనుంచి దాక్కోడానికి ఇలా చేసినట్టున్నాడు.." అని మరొకరు రాసుకొచ్చారు. "బ్రొ అతని తలపై నంబర్ ప్లేట్ ప్రింట్ చేసి ఉండవచ్చు" అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.

పిలియన్ రైడర్‌లు ఇలా వింతగా ప్రవర్తించడం.. ఇంటర్నెట్ యూజర్లకు పరీక్ష పెట్టడం ఇదేం కొత్త కాదు. కొన్ని నెలల క్రితం, బెంగళూరులో ఓ మహిళ పిలియన్ రైడింగ్ చేస్తూ లాప్ టాప్ లో పనిచేసుకుంటూ కనిపించింది. కోరమంగళ-అగరా-ఔటర్ రింగ్ రోడ్ ప్యాచ్‌లో ఆ మహిళ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు ఈ ఘటన వెలుగు చూసింది. 

 

Helmet, what's that? 🤣🤣🤣 pic.twitter.com/8WwA8ICVfz

— ThirdEye (@3rdEyeDude)
click me!