చికున్‌గున్యా వైరస్‌ కు మొట్టమొదటి టీకా.. ఆమోదం తెలిపిన అమెరికా...

By SumaBala Bukka  |  First Published Nov 10, 2023, 10:22 AM IST

ఈషక్ (Ixchiq) పేరుతో అందుబాటులోకి రానున్న ఈ వ్యాక్సిన్ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు వేసుకునే వీలుంది. 


వాషింగ్టన్ : వైరస్ సోకిన దోమల ద్వారా వ్యాపించే చికున్‌గున్యాకు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను యుఎస్ ఆరోగ్య అధికారులు గురువారం ఆమోదించారు, దీనిని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ "ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు" అని పేర్కొంది.
ఐరోపాకు చెందిన వాల్నేవా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ ఈషక్ (Ixchiq) పేరుతో విక్రయిస్తారు. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులు అని ఎఫ్ డీఏ తెలిపింది.

యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ ద్వారా గ్రీన్-లైట్ వైరస్ అత్యంత ప్రబలంగా ఉన్న దేశాలలో ఈషక్ (Ixchiq) వ్యాక్సిన్ రోల్ అవుట్‌ను వేగవంతం చేస్తుందనుకుంటున్నారు. జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగించే చికున్‌గున్యా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది.

Latest Videos

undefined

ఎల్‌ఇటి రిక్రూట్‌మెంట్ సెల్ హెడ్ అక్రమ్ ఘాజీ హతం..

"చికున్‌గున్యా వైరస్ రోజురోజుకూ కొత్త భౌగోళిక ప్రాంతాలకు వ్యాపిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది" అని ఎఫ్ డీఏతెలిపింది, గత 15 సంవత్సరాలలో 5 మిలియన్లకు పైగా కేసులు నమోదైనట్లుగా తెలిపింది.

"చికున్‌గున్యా వైరస్‌తో ఇన్‌ఫెక్షన్ తీవ్రమై వ్యాధిగా మారుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి ఎక్కువ ముప్పు" అని సీనియర్ ఎఫ్ డిఏ అధికారి పీటర్ మార్క్స్ ఒక ప్రకటనలో తెలిపారు. "ఇది ఇప్పటివరకు ఆమోదం పొందని వైద్య అవసరాన్ని పరిష్కరిస్తుంది. పరిమితంగా ఉన్న చికిత్సా విధానాలతో వ్యాధిని బలహీనపరచడంతో, నివారించడంలో ముఖ్యమైన పురోగతిగా చెప్పొచ్చు" అన్నారు. 

టీకా ఒక్క డోస్ మాత్రమే ఉంటుంది. ఇతర వ్యాక్సిన్‌ల మాదిరిగానే చికున్‌గున్యా వైరస్ ప్రత్యక్ష, బలహీనమైన వెర్షన్‌ లను కలిగి ఉంటుంది. దీనికి ముందు ఈ టీకా విషయంలో ఉత్తర అమెరికాలో 3,500 మందిపై రెండు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, వికారం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ట్రయల్స్‌లో 1.6 శాతం ఈషక్ (Ixchiq) టీకా తీసుకున్న వారితో సీరియస్ రియాక్షన్స్ కనిపించాయి. వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 

click me!