ఈ ప్రపంచంలో వింతలు అనేకం కొన్ని అబ్బుపరిచేవి మరికొన్నిసంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవి.. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో అనుకొని వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఈ ప్రపంచంలో వింతలు అనేకం కొన్ని అబ్బుపరిచేవి మరికొన్నిసంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవి.. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో అనుకొని వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పురుషాంగాన్ని పోలిన చేప జాతికి చెందిన వేలాది జీవులు సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. వాటిని చూసిన పర్యాటకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
undefined
A post shared by Bay Nature Magazine (@baynaturemagazine) on Dec 11, 2019 at 11:58am PST
వీటికి సంబంధించిన పోటోలను కొందరు పర్యాటకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ది వైల్డ్ లైఫ్ సొసైటీ బయోలజిస్ట్ ఇవాన్ పార్ ఈ జీవి వివరాలను వెల్లడించారు. 10-అంగుళాల పోడువుతో ఉండే ఈ జీవి సముద్రం అట్ట అడుగున నివసిస్తుందని తెలిపారు. ల్సింగ్ పెనిస్ ఫిష్ జీవులు చూడడానికి మానవ పురుషాంగం అకారంలో ఉంటాయి. వీటిని "ఫాట్ ఇన్ కీపర్ వార్మ్"అని కూడా పిలుస్తారు.
అయితే సముద్ర లోపల జీవించే ఇవి ఓడ్డుకు ఎలా వచ్చాయంటే.. సముద్రంలో ఏర్పాడిన తుఫాను కారణంగా బలమైన అలల వచ్చాయని దీంతో అడుగు భాగాన ఉన్న ఈ జీవులు సముద్ర తీరానికి తరలివచ్చాయి. వీటిని ప్రతి సంబంధించిన ప్రతి విషయం కొంత ఆశ్చర్యానికి గురిచేసేదే, జీవులు బ్యాక్టీరియా, సముద్ర నాచును ఆహరంగా తీసుకుంటాయి. వాటితో పాటు ఈ జీవి ముందుభాగంలో ఉండే మ్యూకస్ ద్రవం ద్వారా చిన్న చిన్న నాచు మొక్కలు, క్రిములను కూడా తింటాయి. అలాగే వీటిని చైనాలో రోజూవారిగా వంటల్లో భాగంగా ఉపయోగిస్తారంటా!.