వందలు.. వందలుగా.. గుంపులు గుంపులుగా.. ఒకేసారి

By Rekulapally SaichandFirst Published Dec 13, 2019, 3:41 PM IST
Highlights

ఈ భూగోళం అనేక రకాల జీవజాతుల  మేళరింపు. ఈ ప్రపంచం  అరుదైన, అందుమైన  జీవులకు అవాసం. అయితే ఇంతటి జీవవైవిధ్యం ఉట్టిపడుతున్న నేలపై ఏదో అలజడి మెుదలవుతుంది. మంచు పర్వతాలు కరిగి పోతున్నాయి. 

ఈ భూగోళం అనేక రకాల జీవజాతుల  మేళరింపు. ఈ ప్రపంచం  అరుదైన, అందుమైన  జీవులకు అవాసం. అయితే ఇంతటి జీవవైవిధ్యం ఉట్టిపడుతున్న నేలపై ఏదో అలజడి మెుదలవుతుంది. మంచు పర్వతాలు కరిగి పోతున్నాయి. అడువులు నశిస్తున్నాయి, జంతువులకు అవాసం లేకుండా పోయింది.  ఉన్నట్టుండి వేలాది పక్షులు, మృతివాత పడుతున్నాయి. ఈ పరిణామాలు పర్యవరణ ప్రేమికులను ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా యూకేలోని నార్త్ వేల్స్‌లో  300 పక్షులకు పైగా కింద పడి చనిపోయాయి. గాల్లో ఎగురుతూనే హఠాత్తుగా  పడిపోయాయి. ఆకాశంలో  స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు ఒక్కసారిగా టపటపా నేలపై రాలిపోయాయి. కొన్ని గాలిలోనే ప్రాణాలు  కోల్పోతే  మరికొన్ని కింద పడి విలవిలాడుతూ మరిణించాయి. 

హన్నా స్టెవెన్స్ అనే మహిళ  హాస్పిటల్‌ వెళ్లి వస్తున్న క్రమంలో వందలాది పక్షులు  నిర్జీవంగా  పడి ఉండడం గమనిచింది. దీంతో ఆందోళన చెందిన ఆమె వెంటనే వాటి ఫోటోలను తీసి భర్తకు పంపించింది. తాను ఈ దారి గుండా వెళ్ళినప్పుడు వందలాది పక్షులను  ఎగరడం గమనించనని తిరిగి వచ్చి చూసే సరికి ఈ అవి చనిపోయి ఉన్నాయని  భర్తకు తెలిపింది.

భార్య సందేశాన్ని చూసిన   భర్త డఫైడ్ ఎడ్వర్డ్స్‌ వెంటనే సంఘటన స్ధలికి వెళ్ళాడు. దాదాపు 300 వందల పక్షులకు పైగా చనిపోయినట్లు వారు గుర్తించారు.  వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని చనిపోయిన పక్షుల్ని స్వాధీనం చేసుకున్నారు.

 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.వాటిని ఎవరైనా చంపారా?  లేక సహజ మరణమా? అనే కోణంలో  పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఇటువంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అనేకంగా జరిగాయి. సముద్ర తీరాలలో, అటవి ప్రాంతాలలో జంతువులు,పక్షులు గుంపులుగుంపులుగా మృతివాత పడ్డాయి. అయితే అనార్ధాలకు కారణం మనిషి సృష్టిస్తున్న విపత్తులే అనేది  స్పుస్పస్టం.  లివింగ్ ప్లానెట్ రిపోర్టు ప్రకారం 2020 నాటికి 3/2 శాతం సకశేరుకాలు అంతరించే ప్రమాదం ఉందని  చెప్తున్నది. మనిషి ఈ  భూ ప్రపంచం తనకే సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తూ జీవవైవిధ్యనికి  అంటకం కలిగిస్తున్నాడు. ఇతర జీవ జాతుల మనగడకే ముప్పు తీసుకోస్తున్నాడు.
 

click me!