దీపావళి నాడు తన తిక్కను చూపించాడో యూ ట్యూబర్. ఓ కారుకు లక్ష మిర్చి టపాకులతో అలంకరించి, కాల్చాడు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.
దీపావళి అంటే దీపాలు వెలిగించడమే కాదు టపాసులు కాల్చడం కూడా. చిన్నా, పెద్దా తేడా లేకుండా టపాసులు కాల్చడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు. సాయంత్రం అయ్యిందంటే చాలు టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. వీరి ఆనందాన్ని మరింత పెంచడానికి టపాసుల తయారీదారులు రకరకాల కొత్త వెరైటీలతో వారిని ఆకట్టుకుంటారు. ఇక టపాసులు కాల్చే విషయంలో ఎవరి స్టైల్ వారిదే. ఇలా దీపావళి సందర్భంగా డిఫరెంట్ గా టపాసులు కాల్చిన స్పెషల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే…
దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్ కొత్తగా ఆలోచించాడు. అందరిలో మనం కూడా బాణాసంచా మామూలుగా కాలిస్తే కిక్కేముంది… అనుకున్నాడో ఏమో ..డిఫరెంట్ గా ఆలోచించాడు. రాజస్థాన్లోని ఆల్వార్ కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. దీపావళికి కొత్తగా ఏం చేద్దాం అని ఆలోచించాడు.. ఓ కారును టార్గెట్ చేశాడు.. దీపావళిని పురస్కరించుకుని ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులను వరుసగా పేర్చాడు. కారు ముందు ఉన్న గ్లాస్ పై మాత్రం టపాసులు పెట్టలేదు. ఆ తర్వాత వన్ టూ త్రీ అంటూ బాంబులు పేల్చాడు.
undefined
గాజు సీసాలో టపాసులు పేల్చొద్దన్నందుకు.. వ్యక్తిని కత్తితో పొడిచిన మైనర్లు, చికిత్స పొందుతూ మృతి...
ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్దాలతో మారుమోగిపోయింది. లక్ష టపాసులు మరి. ఆ తర్వాత మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళాడు. బాంబులు పేలడంతో కారు కలర్ మొత్తం మారిపోయింది. కారులోపల పొగ పూర్తిగా నిండిపోయింది. కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ గ్లాస్ మెత్తబడి పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ మాత్రం పని చేయడం విశేషం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, దీనిమీద నెటిజన్లు డిఫరెంట్గా స్పందించారు. మెంటల్ అంటూ తిట్టి పోశారు. నీ వెర్రి వెయ్యి విధాలుగా ఉంది.. అంటూ కామెంట్ చేశారు. వాళ్లన్నారని కాదుగానీ.. ఇది నిజంగా ఎంత భయంకరమైన చర్య.. ఆ బాంబులకు కారు పేలితే... ఇంకేదైనా ప్రమాదం జరిగితే.. ఏంటి పరిస్థితి.. అయితే, ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. అతను ఈ పని ఇళ్లమధ్యలో కాకుండా కాస్త దూరంగా ఓపెన్ ప్లేస్ లో ఎవ్వరూ లేని చోట చేయడమే.
: Ahead of Diwali, this Youtuber sets car on fire by covering it with firecrackers, video goes viral
Video Courtesy: Crazy XYZ pic.twitter.com/oUixu6f5sR