రెగ్యులర్ వాటికి కాస్త భిన్నంగా కనిపిస్తే చాలు వైరల్ అవుతుంటాయి. అలా ఓ పీహెచ్ డీ విద్యార్థి తనను డిస్టర్బ్ చేయద్దంటూ రాసుకున్న నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నేను పీహెచ్డీ చేస్తున్నాను… నాకు డైవర్షన్ ఉండదు.. అందుకే నాతో ఎవరు మాట్లాడొద్దు. మరీ నాతో మాట్లాడటం అవసరం అనుకుంటే మెయిల్ చేయండి.. అంటూ ఓ పి హెచ్ డి విద్యార్థి తన ఎదుట అతికించిన పేపర్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ నోట్ ను గమనించిన స్టీవ్ బింగ్ హామ్ అనే లెక్చరర్.. దీన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. అంతేకాదు దానికి ప్రతీ పీహెచ్ డి విద్యార్థికి ఏదో ఒక సమయంలో ఇది కరెక్ట్ గా సరిపోతుంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
కొంతమంది పనులు వాయిదా వేస్తుంటారు. కాసేపాగి చేద్దాంలే, రేపు చేద్దాం లే, తొందరేం లేదు కదా.. తర్వాత చేద్దాం.. ఇలా వాయిదా వేసుకుంటూ పోతుంటారు. కొన్ని విషయాలు అయితే పర్వాలేదు కానీ.. అతి ముఖ్యమైన వాటిల్లోనూ ఇదే పద్ధతి పాటిస్తుంటారు. కారణం.. వాయిదా వేయడం అలవాటుగా మారిపోయి సమస్యకు దారి తీయడమే. విద్యార్థి దశలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి స్కోర్ తగ్గి, అనుకున్న స్థాయిలో చదువుకో లేకపోవచ్చు. ఇక పీహెచ్ డీ, రీసెర్చ్ స్కాలర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరికి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం.
undefined
కాసేపే కదా అని రిలాక్స్ అయినా, ఫ్రెండ్స్ తో చిల్ అయినా, ఫోన్లు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసినా.. వారి పీహెచ్డీ గోవిందా.. పీహెచ్డీ అంటే చాలా కష్టపడాలి. అందుకే చాలా సార్లు వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా అలవాటు ఉన్న ఓ పిహెచ్ డి విద్యార్థి తన అలవాటు నుండి బయటపడడానికి వినూత్నంగా ఆలోచించాడు. తను పీహెచ్డీ చేస్తున్న క్యాబిన్ డోర్ కు ఒక పేపర్ అతికించాడు. ‘ దయచేసి నాతో మాట్లాడొద్దు. నేను పీహెచ్డీకి సంబంధించిన పనిలో ఉన్నాను. ఒకవేళ నేను మాట్లాడటం మొదలు పెడితే మళ్లీ ఆపను. నేను భయంకరంగా వాయిదా వేస్తూ వెళుతుంటాను. పనులు వాయిదా వేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరీ అవసరం అనుకుంటే ఈ మెయిల్ చేయండి’ అంటూ రాసి అతికించాడు. పీహెచ్డీ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఇది అవసరం అవుతుంది అంటూ స్టీవ్ బింగ్ హామ్ అనే అధ్యాపకుడు ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ నోట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
I think every PhD student needs this sign at some point 😂😂 pic.twitter.com/M0xLrntxrW
— Steve_Bingham (@Steve_Bingham92)