నా ఫోటోలు తీస్తే నెలకు రూ.26.6 లక్షల జీతం ఇస్తా.. బిజినెస్ బంఫర్ ఆఫర్

By Rekulapally SaichandFirst Published Dec 19, 2019, 6:41 PM IST
Highlights

మరికొంత మందికి  కష్టపడకుండానే జీవితంలో సెటిల్ కావాలని కల ఉంటుంది. అయితే అలాంటి వారికి ఆస్ట్రేలియాకు చెందిన మిలీనియర్, ఎకామ్ వారియర్ అకాడమీ వ్యవస్థాపకుడు మాథ్యూ లెప్రే ఓ చక్కటి అవకాశం ఇచ్చారు.  

సాధార‌ణంగా చాలా మంది   పగటి కలలు కంటుంటారు. ఉన్నంట్టు ఉండి కోటిశ్వర్లు అవ్వాలని,  ఉన్న బాధాలన్ని హఠాత్తుగా తీరాలనుకుంటారు.అయితే పగటిపూట వచ్చే కలలన్నీ నెరవేరని ఆశల రూపమే అనేది  చాలా మంది మాట. సాధించాలనుకున్న ఆశలు, ఆశయాలకు అడ్డోంచే పరిణామాలు ఎన్నో, ... కష్టాల కడిలి ఈది అనుకున్నది సాధించడం అంటే అంతా ఈజీ కాదు. టాలెంట్ ఉన్న చాలా సందర్భాలలో  టైం కోసం  ఎదురుచూడాల్సిందే. 

మరికొంత మందికి  కష్టపడకుండానే జీవితంలో సెటిల్ కావాలని కల ఉంటుంది. అయితే అలాంటి వారికి ఆస్ట్రేలియాకు చెందిన మిలీనియర్, ఎకామ్ వారియర్ అకాడమీ వ్యవస్థాపకుడు మాథ్యూ లెప్రే ఓ చక్కటి అవకాశం ఇచ్చారు.  తనకో  పర్సనల్ ఫొటోగ్రాఫర్‌  కావలని చూస్తున్నారు. ఈ ఉద్యోగానికి అతను ఇచ్చే జీతం ఎంతో తెలుసా అక్షరాల 37,600 డాలర్లు (రూ.26.6 లక్షలు). 

తను పర్యటించే ప్రదేశాలకు ఫొటోగ్రాఫర్‌  తీసుకెళ్ళి రకాల రకాల పోజుల్లో ఫోటోలు తీసుకోవాలని మాథ్యూ లెప్రే కోరిక. అందుకోసం ఓ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌నునియమించుకోవాలని అనుకుంటున్నాడు.  దీన్ని కోసం బహిరంగగా మీడియాతో మాట్లాడాడు. "ఫొటోలు తీసేందుకు నాకో ఫొటోగ్రాఫర్ కావాలి. ఐరోపా, అమెరికా ఖండాలలోని దేశాలలో నేను పర్యటించాలి అనుకుంటున్నాను. అక్కడ పర్యటిస్తున్న సమయంలో ఫోటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్ అవపరం ఉంది. ఫోటోలను తీసి  వాటిని సోషల్ మీడియాలో ఆఫ్ లోడ్ చేస్తుండాలి" అని తెలిపారు

"అలాగే ఈ ఉద్యోగం కావాలి అనుకున్నవాళ్ళు తప్పకుండా పాస్ పోర్ట్ కలిగిఉండాలి. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ పనులు చక్కబెడుతుండాలి. నాతోనే ఉంటూ నా రోజువారి షెడ్యూల్‌ను ఫాలో అవుతుండాలి. నేను ఎప్పుడంటే అప్పుడు ,ఎక్కడికైనా రావడానికి సిద్దంగా ఉండాలి. వారి ఖర్చులు మెుత్తం నేనే భరిస్తా. అలాగే వారి ఓ సొంత కెమేరాను కలిగి ఉండాలి" అని లెప్రే మీడియాకు వివరించారు. ఈ ఉద్యోగం దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏ దేశం వారైనా పర్వలేదంటా,టాలేంట్ ఉంటే చాలంటా. అయితే మీలో ఫోటోలు తీసే నైపుణ్యం ఉందా ఇంకేందకు అలస్యం వెంటనేసంప్రదించండి.    

click me!