అమ్మాయి ప్రాణం తీసిన ముద్దు! మీరు అలా కిస్ చేశారో..

By Rekulapally Saichand  |  First Published Dec 18, 2019, 5:13 PM IST

ముద్దు.. అదో హ్యూమన్ ఎమోషన్. తనకు  ఇతరులపై ఉన్న ప్రేమను తెలియజేసే ఓ అపూర్వ సాధనం. అదో మర్చిపోలేని అనుభూతి. కానీ ఓ అమ్మాయి  జీవితంలో అది  చేదును మిగిల్చింది.  అది ఓ అమ్మాయి. ప్రాణం  తీసింది.  ముద్దు ఏంటి ప్రాణం తీయడమేంటి అనుకుంటున్నారా!. అవును ఇది నిజం.  అవేదనపూరితమైన సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. అయితే ఇది సాధారణ వైరల్ ఫీవర్ అని ఆమె తల్లిదండ్రులు భావించారు. 


ముద్దు.. అదో హ్యూమన్ ఎమోషన్. తనకు  ఇతరులపై ఉన్న ప్రేమను తెలియజేసే ఓ అపూర్వ సాధనం. అదో మర్చిపోలేని అనుభూతి. కానీ ఓ అమ్మాయి  జీవితంలో అది  చేదును మిగిల్చింది.  అది ఓ అమ్మాయి. ప్రాణం  తీసింది.  ముద్దు ఏంటి ప్రాణం తీయడమేంటి అనుకుంటున్నారా!. అయితే ఆ కథ ఏంటో చూద్దాం!. ఈ అవేదనపూరితమైన సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. 

17 ఏళ్ల అరియానా అనే అమ్మాయి హఠాత్తుగా అనారోగ్యం పాలైంది. తలనొప్పి,గొంతు మంటతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె తల్లిదండ్రులు సాధారణ వైరల్ ఫీవర్ అని భావించారు. అరియానా పరిస్థితి విషమించడంతో ఆ యువతి తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె పరిస్దితి మరింతగా విషమించింది. బెడ్ పై నుంచి లేవలేని పరిస్ధితికి చేరింది. దీంతో డాక్టర్లు సూచన మేరకు అరియానాను మరో మరో హాస్పిటల్‌కు తరలించారు.

Latest Videos

undefined

అక్కడ ఆమె మానసిక పరిస్థితి క్షీణించడంతో వింతగా ప్రవర్తించడం మెుదలు పెట్టింది. చివరకు ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు  ఎప్స్టీన్ బార్ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీనికి మరో పేరు ‘కిస్సింగ్ డిసీజ్’ . ఈ వ్యాధి వల్ల ఆమె మెదడుకు వాపు సోకి పనిచేయకుండా పోయింది. ఈ కారణంగానే  అరియానా ప్రవర్తనలో మార్పు  వచ్చినట్లు తెలిపారు.  వైద్యులు ఎంత ప్రయత్నించనప్పటికీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. అనారోగ్యానికి గురైనా  వెంటనే ఆస్పత్రికి తీసుకొని వచ్చి ఉంటే బతికి ఉండేదని వైద్యులు తెలిపారు. 


ఆమె మరణానికి చెందిన కారణాలను వైద్యులు వివరించారు. ‘కిస్సింగ్ డిసీజ్’తో అరియానా మరణించనట్లు తెలిపారు. ఎప్స్టీన్ బార్ (Epstein Barr Virus-EBV)  అనే వైరస్‌  కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తోందని మనుషుల లాలాజలం ద్వారా ఇతరుల శరీరంలోకి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది వైద్యులు తెలిపారు. అరియానా అతి చూంబనం కారణంగా ఈ వ్యాధి వచ్చి ఉంటుందని వివరించారు. అరియానాకు ఈ వ్యాధి ఏ విధంగా సోకిందనేది ఎవరికీ తెలియదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. విదేశాలలో ఇతురులను కిస్‌తో పలకరించడం కామన్ కాబట్టి  అరియానాను ఎవరైనా ఇలాగే ముద్దుతో పలకరించినప్పుడుఈ వ్యాధి  సోకి ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు 

click me!