విమానాశ్రయంలో పెళ్లి ప్రతిపాదన అనౌన్స్ మెంట్.. ప్రియురాలి రియాక్షన్ ఏంటంటే...

By SumaBala BukkaFirst Published Sep 5, 2023, 8:20 AM IST
Highlights

ఎయిర్ పోర్ట్ లో వినూత్నంగా ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడో ప్రియుడు. అది చూసి ఆమె తీవ్ర సంబ్రమాశ్చర్యాలకు గురైంది. 

న్యూజిలాండ్ : వినూత్నంగా తన ప్రేయసికి తన మనసులోని ఇష్టాన్నిలవ్ ప్రపోజల్ గా వ్యక్తపరిచి ఆశ్చర్యపరుస్తుంటారు కొంతమంది. వారు ప్రపోజ్ చేసే విధానం చూసి అమ్మాయి.. పట్టలేని సంతోషంతో వెంటనే ఓకే చెప్పేస్తుంది. అలాంటి పనే చేశాడు న్యూజిలాండ్ కి చెందిన ఓ వ్యక్తి. న్యూజిలాండ్ లోని అక్లాండ్ కు చెందిన యశ్ రాజ్ బ్యాంకింగ్ స్పెషలిస్ట్. 

అతను రియా శుక్లా అనే ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. రియా శుక్లా ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నారు. రియా పనిలో ఎంతో అలర్ట్ గా ఉంటుంది. చాలా సిన్సియర్. అంత తొందరగా దేనికీ లొంగదు. ఆశ్చర్యపోదు. అలాంటి వ్యక్తితో ప్రేమలో పడ్డాడు యశ్ రాజ్. రియా వృత్తిలో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కు వెళ్లాల్సి వచ్చింది.

భార్యను రాళ్లతో కొట్టి హతమార్చిన భర్త.. దారుణానికి సహకరించిన సోదరులు.. కారణమదేనా..?

ఈ విషయం యశ్ రాజ్ కు తెలిసింది. ఆమె తిరిగి వచ్చే రోజున ఓ పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. ఆ సర్ప్రైజ్ ఆమె జీవితంలో మర్చిపోలేని విధంగా ఉండాలని.. తన మనసులోని కోరికను ఆ సమయంలో బయటపెట్టి…ఆమె అంగీకారాన్ని పొందాలని అనుకున్నాడు. 

దీనికోసం అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశాడు. ఆస్ట్రేలియాలో పని ముగించుకొని ఆమె ఆక్లాండ్ ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టగానే… ఆమెకి ఓ అనౌన్స్మెంట్ వినిపించింది. ప్రయాణికులకు అనౌన్స్మెంట్స్  ఇచ్చే  దగ్గరనుంచి ఆమెకి ఓ వివాహ ప్రతిపాదన చేశాడు.

ఆ తరువాత అందరూ చూస్తుండగానే ఆమె దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద వంగి…ఉంగరంతో… ‘రియా.. నన్ను పెళ్లి చేసుకుంటావా’.. అంటూ ప్రపోజ్ చేశాడు. అసలు ఊహించని ఈ సర్ప్రైజ్ కి ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. చుట్టూ ఉన్నవారు ఈ ఘటనకు ఆశ్చర్యపోయారు.

ఇది ఆగస్టులో జరిగింది. ఈ వీడియోను ఆక్లాండ్ ఎయిర్పోర్ట్ తన సైట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియురాలి కోసం ఏకంగా ఎయిర్పోర్టు వారిని ఒప్పించడానికి గురుడు ఎన్ని తిప్పలు పడ్డాడో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

దీనిమీద యశ్ రాజ్ మాట్లాడుతూ…‘ఇలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎయిర్  పోర్ట్ అధికారులను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించాల్సి వచ్చింది. చివరికి వారు నా అభ్యర్థనను ఒప్పుకున్నారు. ఈ సమయంలో నాకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. నెల రోజులుగా ఈరోజు గురించి ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

click me!