ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. లక్షల కొద్దీ వ్యూస్, వేలాది కామెంట్లతో ఆ వీడియో ఇన్ స్ట్రాగ్రాం ను షేక్ చేస్తుంది.
వరుడి మెడలోని డబ్బుల దండలో డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరదాగా చేసిన పని ఇప్పుడు ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ తెచ్చిపెడుతోంది. ఇన్ స్టా గ్రాంలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అనేక షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది. దీనిమీద జోకులు కూడా పేలుతున్నాయి.
ఈ వీడియోలో, వరుడు మెడలో డబ్బుల దండతో స్నేహితులు, బంధువుల మధ్య కూర్చుని ఉన్నాడు. వరుడి మెడలో డబ్బుల దండ వేయడం పెళ్లిలో బారాత్ సమయంలో మామూలుగా కనిపించే విషయం. అయితే, కాసేపటికి వరుడి పక్కన కూర్చున్న ఒక వ్యక్తి ఆ డబ్బుల దండలోంచి కొన్ని కరెన్సీ నోట్లను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే, వరుడు అతని వైపు తిరగగానే.. వరుడు గమనించాడనుకున్న ఆ వ్యక్తి దండ మీదినుంచి తన చేతిని తీసేస్తాడు.
undefined
మరోసారి ప్రయత్నించినప్పుడు దొంగిలించడంలో ఆ వ్యక్తి సఫలీకృతుడవుతాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఆ వ్యక్తి వరుడి మెడలోని దండనుంచి డబ్బులను విజయవంతంగా దొంగిలించగలిగాడు. ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్, వేలకొద్ది కామెంట్లు వచ్చాయి. కొంతమంది ఈ సన్నివేశం ఎంత ఫన్నీగా ఉందో చెప్పకుండా ఉండలేక పోయారు, మరికొందరు ఇది దాదాపు మనీ హేస్ట్ దేశీ వెర్షన్ లాగా ఉందని రాశారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో ఓ విచిత్ర దొంగతనం బయటపడింది. జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుందా? ఎక్కడ దొంగతనం చేసినా క్షణాల్లో దొరికిపోతాడు.. అలాంటి దొంగే ఇతను కూడా.. ఆంధ్రప్రదేశ్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ ఆలయంలోని అమ్మవారి మీదున్న బంగారం, వెండి కోసం కక్కుర్తి పడ్డాడు. ఎలాగైనా దొంగతనం చేయాలనుకున్నాడు. రాత్రివేళ జనసంచారం లేని సమయం చూసుకుని.. గుడి గోడకు కన్నంవేసి ఎంచక్కా గుళ్లోకి దిగాడు. అనుకున్నట్టుగానే బంగారం, వెండి తీసుకున్నాడు. కానీ..అమ్మవారే ఆగ్రహించిందో.. అతని జాతకమే దెబ్బకొట్టిందో కానీ.. వెళ్లేప్పుడు ఎంచక్కా కన్నంలోంచి దూకిన అతను వచ్చేప్పుడు మాత్రం అంత ఈజీగా రాలేకపోయాడు. ఇంకేముంది కన్నంలో ఇరుక్కుపోయాడు. తెల్లారి ఇది గమనించిన స్థానికులు.. ఏంటా అని దగ్గరికి వచ్చి చూసి షాక్ అయ్యారు. సదరు గుడి యాజమాన్యానికి విషయం తెలిపారు. వీడియోలు తీశారు.
ఈ క్రమంలో ఆ కన్నంలో ఇరుక్కున్న దొంగ... ‘అన్నా బైటికి లాగండన్నా..’ అంటూ వేడుకోవడం.. కనిపిస్తుంది. తొమ్మదిగ్రాముల వెండి, అమ్మవారి ముక్కుపుడకలాంటి చిన్న చిన్న వస్తువులకోసం ఆశపడి.. ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు చెబుతున్న వివరాల్లోకి వెడితే.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసిన ఓ దొంగ పారిపోతుండగా.. గోడ కున్న కన్నంలో ఇరుక్కుపోయాడని పోలీసు అధికారి బుధవారం తెలిపారు. నిందితుడిపై శ్రీకాకుళం జిల్లా కంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసు నమోదైంది.