రెచ్చగొట్టే పాటకు పెళ్లిలో వధువు డ్యాన్స్.. నాకు సెట్ కావు అంటూ విడాకులిచ్చి చక్కా పోయిన వరుడు..

By SumaBala BukkaFirst Published Jan 11, 2022, 10:29 AM IST
Highlights

ఇరాక్ లో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. అతడి అనూహ్య నిర్ణయం గురించి తెలిస్తే మనం మరింత షాక్ అవుతాం. ఆ వేడుకలో వినిపిస్తున్న పాట.. అతడికి,  తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఆ పాట పెడ ధోరణులను రెచ్చగొట్టే విధంగా  ఉందనేది వారి అభిప్రాయం. ఆ పాట అర్థం…అందులోని అంతరార్థం స్పష్టంగానే తెలుస్తున్నా కూడా వధువు తనను తాను మరచిపోయి నృత్యం చేయడాన్ని భరించలేకపోయాడు.

ఇరాక్ : వారికి  వివాహమై కొన్ని క్షణాలు అయింది Wedding ceremony ఇంకా పూర్తి కాలేదు. అక్కడ వినిపిస్తున్న పాటకి Bride స్టెప్పులేస్తూ ఉంది. ఇంతలో వరుడు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చాడు. మనిద్దరం కలిసి ఉండడం కుదరదు... అంటూ ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి తన దారిన తాను వెళ్ళిపోయాడు.

ఇరాక్ లో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. అతడి అనూహ్య నిర్ణయం గురించి తెలిస్తే మనం మరింత షాక్ అవుతాం. ఆ వేడుకలో వినిపిస్తున్న పాట.. అతడికి,  తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఆ పాట Provocative Song అని, పెడ ధోరణులను రెచ్చగొట్టే విధంగా  ఉందనేది వారి అభిప్రాయం.

ఆ పాట అర్థం…  అందులోని అంతరార్థం స్పష్టంగానే తెలుస్తున్నా కూడా వధువు తనను తాను మరచిపోయి నృత్యం చేయడాన్ని భరించలేకపోయాడు. పై చేయి నాది.. నీవు నీ కంట్రోల్ లోనే ఉండాలి... ఇలా సాగింది ఆ పాట. దీంతో చిర్రెత్తుకొచ్చిన వరుడు ఈ ఆధిపత్యం భరించలేను అంటూ అప్పటికప్పుడు భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు, చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. 

ఇదిలా ఉండగా, డిసెంబర్ 26న ఇజ్రాయెల్‌లోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సగటు మనిషి వందేళ్లు బతకడం నేడు గొప్ప. అలాంటిది ఆ కోర్టు ఓ వ్యక్తిపై 8 వేలకుపైగా సంవత్సరాల నిషేధాజ్ఞలు విధించింది. ఔను.. ఓ ఆస్ట్రేలియా వ్యక్తిపై ఈ నిషేధం విధించింది. 

Divorce Case విచారిస్తూ సదరు వ్యక్తి ఇజ్రాయెల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం డిసెంబర్ 31, 9999 వరకు వర్తిస్తాయని ప్రకటించింది. దీంతో నిందితుడ నివ్వెరపోయాడు. నోవామ్ హపర్ట్ ఆస్ట్రేలియా దేశస్తుడు. ఆయన ఇజ్రాయెల్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి సంతానం కూడా కలిగింది. 

కానీ, ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలతో ఆమె ఆస్ట్రేలియా వదిలి స్వదేశం ఇజ్రాయెల్ వెళ్లిపోయింది. నోవామ్ కూడా తన పిల్లలకు దగ్గరగా జీవించాలనే కాంక్షతో 2012లో ఇజ్రాయెల్ వెళ్లాడు. ఇజ్రాయెల్‌లోనే ఆయనపై భార్య 2013లో విడాకుల కేసు పెట్టింది. ఈ కేసు విచారిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 

ఆ మహిళ ఇద్దరు పిల్లలు 18 ఏళ్లు నిండే వరకు రోజుకు 5000 ఇజ్రాయెల్ షెకెల్స్ ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ భవిష్యత్ రుణాన్ని పూర్తి చేసే వరకు దేశం విడిచి వెళ్లవద్దని తెలిపింది. అంటే, ఇప్పుడు నోవామ్ హపర్ట్ హాలీడేల కోసమైనా, పని కోసమైనా ఇజ్రాయెల్ దేశం విడిచే అవకాశమే లేదు. 

ఆ తీర్పు ప్రకారం, నోవామ్ హపర్ట్ 3.34 మిలియన్ డాలర్లకు మించి చెల్లిస్తే ఇజ్రాయెల్ దేశం వదిలి బయట అడుగు పెట్టవచ్చు. లేదా 9999 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇజ్రాయెల్ దేశం విడవరాదని ఆదేశించింది. 2013 నుంచి నేను ఇజ్రాయెల్‌లో బంధీగానే ఉన్నా.. అంటూ ఈ తీర్పుపై స్పందిస్తూ నోవామ్ హపర్ట్ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ మహిళను పెళ్లి చేసుకున్నందుకు విదేశీయులను ఈ దేశ న్యాయవ్యవస్థను దారుణంగా శిక్షిస్తున్నదని వాపోయారు. 

click me!