ఆ వీడియోలొ చిన్నారి.. పింక్ జాకెట్ ధరించి ఉంది.. కశ్మీర్ లోని తాము ఉంటున్న ప్రాంతంలో.. రోడ్లు.. సరిగా లేవని.. దాని కారణంగా.. అతిథులు.. ఆ ప్రదేశానికి రాలేకపోతున్నారని.. ఆ చిన్నారి వీడియోలో వివరించడం విశేషం.
తమ ప్రాంతంలో రోడ్లు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో తెలియజేసేందుకు.. ఓ చిన్నారి రిపోర్టర్ గా మారింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. కశ్మీర్ కి చెందిన ఈ చిన్నారిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంల వర్షం కురుస్తోంది. ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా మాట్లాడింది అంటూ.. ప్రశంసిస్తున్నారు.
ఆ వీడియోలొ చిన్నారి.. పింక్ జాకెట్ ధరించి ఉంది.. కశ్మీర్ లోని తాము ఉంటున్న ప్రాంతంలో.. రోడ్లు.. సరిగా లేవని.. దాని కారణంగా.. అతిథులు.. ఆ ప్రదేశానికి రాలేకపోతున్నారని.. ఆ చిన్నారి వీడియోలో వివరించడం విశేషం.
Meet Youngest reporter from the Valley. pic.twitter.com/4H6mYkiDiI
— Sajid Yousuf Shah (@TheSkandar)
undefined
కాగా.. కశ్మీర్ వ్యాలీ నుంచి అతి పిన్న వయస్కురాలైన రిపోర్టర్ ని కలుసుకోండి. అంటూ.. చిన్నారి వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఆ రోడ్డులోని గుంతలను కెమేరాతో చూపించని.. ఆ చిన్నారి వాళ్ల ఆమెకు చెప్పడం కూడా.. వీడియోలో తెలుస్తోంది.
కాశ్మీర్ లోయలో ఇటీవల భారీ మంచు, వర్షం కురిసింది. ఆ వర్షం దాటికి బురద పేరుకుపోయి.. రోడ్లు ఎంత అధ్వాన్నంగా మారాయో వివరిస్తూ.. ఆ చిన్నారి 2 నిమిషాల వీడియోని చిత్రీకరించింది. మొబైల్ ఫోన్ లో ఈ వీడియో తీసింది. తాను నడుచుకుంటూ రోడ్డు మీద గుంతలను చూపించింది. రోడ్డుపై ప్రజలు చెత్త కూడా వేస్తున్నారని.. ఆమె ఆ వీడియోలో చూపించడం గమనార్హం.
తన వీడియో చూసిన తర్వాత.. లైక్, కామెంట్, సబ్ స్క్రైబ్ చేయండి అంటూ.. ఆ చిన్నారి చివర్లో పేర్కొనడం గమనార్హం. తర్వాతి వీడియోలో మళ్లీ కలుస్తానంటూ.. చెప్పి వీడియోని ముగించింది.
ఈ వీడియోని కొన్ని వేల మంది ట్విట్టర్ లో షేర్ చేశారు. లక్షల మంది వీక్షించారు. కాగా.. చిన్నారి గతంలోనూ ఇలాంటి వీడియోలు చేయడం గమనార్హం. ఇప్పుడు రోడ్ల పరిస్థితి వివరించగా.. గతంలో.. ఆన్ లైన్ విద్య గురించి అధికారుల సహాయం కోరింది.