మామూలుగా.. నూడుల్స్ ఉడికించడానికి నీరు వాడతారు. అయితే.. ఆ వ్యాపారి కూల్ డ్రింక్ ని ఉపయోగించాడు. కూల్ డ్రింక్ లో నూడుల్స్ ఉడికించి.. దానిిన తయారు చేశాడు
ఇన్ స్టాంట్ నూడిల్స్.. ని ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అప్పటికప్పుడు.. వేడి వేడిగా.. నూడిల్స్ తయారు చేసుకొని.. సాయంత్రం వేళ తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఈ వేడి వేడి నూడిల్స్ కి కాంబినేషన్ గా ఓ కూల్ డ్రింక్స్ తాగితే.. అబ్బ.. ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే.... ఈ నూడిల్స్ తయారు చేసేటప్పుడు.. అందులో కూల్ డ్రింక్ కలపడం గురించి మీకు తెలుసా..? ఛీ..ఛీ.. ఇలా కూల్ డ్రింక్ తో కలిపి ఎవరైనా నూడుల్స్ తయారు చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారా..? ఘజియాబాద్ లోని ఓ వ్యాపారి అదే చేశాడు.
undefined
ఘజియాబాద్ లోని ఓ వీధి వ్యాపారి.. ఇన్ స్టాంట్ నూడుల్స్ తయారు చేసేటప్పుడు.. దానిలో కూల్ డ్రింక్ మిక్స్ చేశాడు. అలా తయారు చేసి... తన దగ్గరకు వచ్చిక కష్టమర్లకు వడ్డించాడు. మామూలుగా.. నూడుల్స్ ఉడికించడానికి నీరు వాడతారు. అయితే.. ఆ వ్యాపారి కూల్ డ్రింక్ ని ఉపయోగించాడు. కూల్ డ్రింక్ లో నూడుల్స్ ఉడికించి.. దానిిన తయారు చేశాడు. అందులో ఉల్లిపాయలు, మ్యాగీ మసాలా వేసి.. తయారు చేశాడు. కాగా.. దానిని అక్కడివారు ఎగబడి మరీ తినడం విశేషం.
దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో... ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోని 233 వేల మంది వీక్షించగా.. దీనికి 8,591 లైకులు వచ్చాయి. కామెంట్ల వర్షం కూడా కురుస్తుండటం గమనార్హం.
ఘజియాబాద్ లోని సాగర్ పిజ్జా పాయింట్ లో.. ఈ కూల్ డ్రింక్ మ్యాగీ తయారు చేయడం గమనార్హం. అయితే.. ఈ వీడియో కింద.. పాజిటివ్ కంటే.. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ రావడం గమనార్హం.