దిశ హత్యోదంతం బయటకు రాగానే... చాలా మంది ఆమెకు శాంతి చేకూరలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే... కొందరు మాత్రం నీచంగా కామెంట్స్ పెట్టారు. వీళ్లని మించి చాలా మంది క్రూరులు ఉన్నారని ఆలస్యంగా తెలిసింది.
హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ... అతి కిరాతకంగా నలుగురు మృగాళ్ల వేటకి బలైపోయింది. ఆమెపై హత్యాచారానికి పాల్పడిన నలుగురు మృగాళ్లను పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. అయితే... బయట ఇలాంటి మృగాళ్లు, కిరాతకులు, ఆడది కనిపిస్తే చాలు ఆకలితో ఎదురుచూసేవాళ్లు ఇంకా లక్షల మంది ఉన్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిండా 30ఏళ్లు లేని ఓ అమాయకు ఆడపిల్ల జీవితం కొద్ది గంటల్లో కాలి బూడిదవ్వడం చూసి చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. నిందితులను అతి కిరాతకంగా చంపేయాలని చాలా మంది నినాదాలు చేశారు. అయితే.. ఇదంతా ఒకవైపు మాత్రమే.. మరోవైపు క్రూరత్వాన్ని మనసంతా నింపుకున్న రాక్షసులు ఉన్నారు. మంచితనం అనే ముసుగుతో అందరి ముందు తిరుగుతూ ఒంటరిగా ఉన్నప్పుడు తమలోని మృగాడిని బయటకు తీస్తున్నారు.
undefined
ఇంతకీ మ్యాటరేంటంటే.... దిశ హత్యోదంతం బయటకు రాగానే... చాలా మంది ఆమెకు శాంతి చేకూరలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే... కొందరు మాత్రం నీచంగా కామెంట్స్ పెట్టారు. వీళ్లని మించి చాలా మంది క్రూరులు ఉన్నారని ఆలస్యంగా తెలిసింది.
AlsoRead justice for disha: కృష్ణా నదిలో ‘దిశ’ అస్థికల నిమజ్జనం...
ఆడపిల్ల నరకం అనుభవించి ప్రాణాలు పోగొట్టుకుంటే... ఆ కీచక కాండను కళ్లారా చూసి ఆనందించాలని 80లక్షల మంది భావించారు. దాదాపు 80లక్షల మంది దిశ రేప్ వీడియో చూడాలని పోర్న్ వెబ్ సైట్స్ లో వెతకడం గమనార్హం. పోర్న్ వైబ్ సైట్ లో దిశ రేప్ వీడియో టాప్ ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం.
దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు మనలో మానవత్వం అనేది ఏ స్థాయికి పడిపోయిందో అన్నది తెలుసుకోవడానికి. మనుషులు అందరూ ఎంత పైశాచికంగా తయారవుతున్నారో అనడానికి పై సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.
ఒక అమ్మాయి ఇలా దారుణంగా బాధను అనుభవించి చనిపోతే దానికి సంబంధించిన వీడియో కోసం అన్ని సెర్చ్ లు నమోదవ్వడమంటే దాన్ని ఏమని అనాలి. మనుషులుగా మనం ఫెయిల్ అయ్యామని ఒప్పుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? పోర్న్ సైట్లలో ఓ ఆడపిల్ల ఆఖరి ఆర్తనాదాలు చూడాలని అనుకున్నారంటే.. వారు రేప్ చేసిన ఆ నలుగురు మృగాళ్ల కంటే ఆలోచనా తీరులో ఎంత మాత్రం తక్కువ కాదు. ఇలాంటి సెర్చ్ లు చేసే వాళ్ళు ఉన్నంత కాలం ఎంతో మంది ప్రియాంకలు బలి అవుతూనే ఉంటారు.
కాగా... ఈ వార్తపై చాలా మంది మహిళలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వాళ్లకంటే జంతువులు చాలా బెటర్ అంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం. జంతువులకు కూడా కొన్ని విలువలు ఉంటాయోమో... వీళ్లకి అది కూడా లేదని.. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుగా ఉందని కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు.