ఒమిక్రాన్ రాకతో మళ్లీ వర్క్ ఫ్రం హోం.. వైరల్ అవుతున్న హర్ష్ గొయెంకా ట్వీట్..

By SumaBala Bukka  |  First Published Jan 5, 2022, 11:26 AM IST

గతేడాది మే తర్వాత సెకండ్ వేవ్ ముగిసి కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. కొందరు తిరిగి కార్యాలయాలకు రావాల్సి వచ్చింది.  2022లో మిగతా వారిని కూడా పిలుద్దాం అని భావిస్తుండగా.. ఒమిక్రాన్ వచ్చిపడింది. దాంతో అంతా మొదటికే వచ్చింది. మళ్లీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోం కొనసాగించాల్సి వస్తోంది. 


ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్వీట్లతో ఆకట్టుకోవడంలో సినిమాస్టార్లే కాదు బిజినెస్ మ్యాన్లూ ముందు వరుసలో ఉంటున్నారు. 24 గంటలూ వ్యాపార లావాదేవీలకు తలమునకలవుతూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సందర్భానికి తగ్గట్టుగా స్పందిస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు.

ఇలాంటి వాటిల్లో Anand Mahindra ముందు వరుసలో ఉంటారు. అనేక సోషల్ అవేర్ నెస్, హ్యుమన్ ఇంట్రెస్టెట్ ట్వీట్లతో ఆకట్టుకుంటారు. అదే కోవలో harsh goenka కూడా వస్తారు. తాజాగా ఆయన omicron నేపథ్యంలో  work from home మళ్లీ మొదలవ్వడం మీద ఓ ఫన్నీ ట్వీట్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. 

Latest Videos

undefined

దేశంలో కరోనా వైరస్ కాలు మోపిన దగ్గరనుంచి అన్ని రంగాల మీద ప్రభావం పడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల విషయంలో వినిపించే ‘వర్క్ ఫ్రం హోం’ విధానం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి సంస్థ సిబ్బందికి ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించింది. 

Coronavirus: డెల్టా మాదిరిగానే ఒమిక్రాన్ పంజా.. జ‌న‌వ‌రిలోనే పీక్ స్టేజ్ !.. ఆంక్ష‌లు ఆప‌లేవు !

దీంతో చాలామంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయిన వాళ్ళ మధ్య ఆడుతూ పాడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు.  గతేడాది మే తర్వాత సెకండ్ వేవ్ ముగిసి కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. కొందరు తిరిగి కార్యాలయాలకు రావాల్సి వచ్చింది.  2022లో మిగతా వారిని కూడా పిలుద్దాం అని భావిస్తుండగా.. ఒమిక్రాన్ వచ్చిపడింది. దాంతో అంతా మొదటికే వచ్చింది. మళ్లీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోం కొనసాగించాల్సి వస్తోంది. 

ఇదే విషయాన్ని ఓ మీమ్ వీడియో రూపంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గొయోంకా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ నటించిన మొహబ్బతీన్ చిత్రంలోని ఆ వీడియో క్లిప్ ను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా క్యాప్షన్లతో తీర్చిదిద్దారు. ఇప్పుడది నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది.

ఇదిలా ఉండగా, భారత్‌లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. గత వారం రోజులుగా కేసుల్లో (covid cases in india) భారీ పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 58,097 Covid కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. అయితే ఇవి క్రితం రోజుతో పోల్చితే 55 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనాతో మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,551కి చేరింది. నిన్న కరోనా నుంచి 15,389 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,004 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో రోజువారీ పాజివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. 

WFH…..
pic.twitter.com/UfavDRUj3Y

— Harsh Goenka (@hvgoenka)
click me!