కారును పళ్లతో లాగుతూ.. బీభత్సం సృష్టించిన పులి... వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...

By SumaBala BukkaFirst Published Jan 1, 2022, 9:47 AM IST
Highlights

మహీంద్రా Xylo SUV కారు వెనుక బంపర్‌ను పెద్ద పులి పదే పదే కొరుకుతూ.. బంపర్ ను నష్టపరచడం వీడియోలో కనిపిస్తుంది. ఒకానొక సమయంలో, అది బంపర్‌పై పట్టు సాధించి కారును వెనక్కి లాగింది. ఈ దృశ్యాన్నంతా రోడ్డుపై ఆపిఉన్న మరో కారులోని పర్యాటకులు చిత్రీకరించారు.

కర్నాటక : karnatakaలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో రోమాలు నిక్కబొడుచునే ఘటన జరిగింది.Viral గా మారిన ఓ వీడియోలోని దృశ్యాలు చూస్తుంటే భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ వీడియోను పారిశ్రామికవేత్త Anand Mahindra తన ట్విట్టర్‌ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో పులి తన కోరపళ్ల బలాన్ని చూపించింది. పళ్లతో పర్యాటకులతో నిండిన SUVని లాగడం కనిపించింది. 

ఈ దృశ్యాన్ని వేరే కారులో ఉన్న వారు వీడియో తీశారు. దీనికి "ఓ మై గాడ్ పులి కారును మొత్తం లాగేస్తుంది" అంటూ సదరు పర్యాటకుడు కామెంట్ చేశారు. ఈ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో పులి చర్యలకు మిగతావారు భయంతో అరవడం వినిపిస్తుంది. 

మహీంద్రా Xylo SUV కారు వెనుక బంపర్‌ను పెద్ద పులి పదే పదే కొరుకుతూ.. బంపర్ ను నష్టపరచడం వీడియోలో కనిపిస్తుంది. ఒకానొక సమయంలో, అది బంపర్‌పై పట్టు సాధించి కారును వెనక్కి లాగింది. ఈ దృశ్యాన్నంతా రోడ్డుపై ఆపిఉన్న మరో కారులోని పర్యాటకులు చిత్రీకరించారు. "ఓహ్ అది కారును వెనక్కి లాగుతుంది,"అని కారుని లాగుతున్న దృశ్యాన్ని చూపించడానికి కెమెరా ప్యాన్ చేయడానికి కొద్దిసేపటి ముందు వారిలో ఒకరు పర్యాటకులతో చెప్పడం వినిపించింది.

Vaishno Devi shrineలో తొక్కిసలాట: 12 మంది భక్తులు మృతి, 14 మందికి గాయాలు

ఈ వీడియో కింద ఉన్న కామెంట్లలో చేసిన కామెంట్లను బట్టి.. పులి లాగుతున్న కారులో ఉన్న పర్యాటకులలో ఒకరు యష్ షా అనే వ్యక్తి గా గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో బెంగళూరు సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్‌ పార్క్‌లో జై వాహనం బ్రేక్ డౌన్ అయిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.

 మెసేజింగ్ యాప్ సిగ్నల్‌లో ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ ఇది దావాగ్నిలా వ్యాపిస్తోందని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. ఇంకా కామెంట్ చేస్తూ "సరే, ఆ కారు Xylo, కాబట్టి పులి దానిని నమలడంలో ఆశ్చర్యం లేదని నేను అనుకుంటున్నాను. బహుశా ఆ పులికి మహీంద్రా కార్లు Deeeliciouss అనిపించాయేమో.. అని నా అభిప్రాయు" అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఫన్నీగా రాశారు.

ఇక నిన్న ఈ వీడియోను షేర్ చేయబడినప్పటి నుండి 4 లక్షలకు వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్లకయితే లెక్కేలేదు. చాలా మంది పులి బలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకింత భయాందోళనలకు గురయ్యారు.

Xylo లోపల ఉన్న యష్ షా, ఇంకో వైపు నుంచి తీసిన మరో వీడియోను షేర్ చేశారు. పిల్లిజాతి జంతువైన పులి.. కోరలు చాలా బలంగా ఉంటాయి. అవి చదరపు అంగుళానికి వెయ్యి పౌండ్ల కంటే ఎక్కువ ఒత్తిడిని ఇవ్వగలుగుతాయి. ఫీల్డ్ అండ్ స్ట్రీమ్ ప్రకారం, పులి కోరల శక్తి సింహం కంటే రెండు రెట్లు ఎక్కువ.


 

Going around like wildfire. Apparently on the Ooty to Mysore Road near Theppakadu. Well, that car is a Xylo, so I guess I’m not surprised he’s chewing on it. He probably shares my view that Mahindra cars are Deeeliciousss. 😊 pic.twitter.com/A2w7162oVU

— anand mahindra (@anandmahindra)
click me!